కశ్మీర్‌పై కేంద్రానికి మరింత సమయం

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధించిన నిషేధాజ్ఞలన్నిటినీ ఎత్తి వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై తక్షణం ఎలాంటి ఆదేశాలను జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడాని కి కేంద్రానికి కొంత సమయం ఇచ్చి చూస్తామని అంటూ కేసు తదుపరి విచారణను మరో రెండువారాలకు వాయిదా వేసింది. ఆర్టికల్ 370ని రద్దుచేసిన తర్వాత కేంద్రం జమ్మూకశ్మీర్ ఓ అత్యంత కఠినమైన ఆంక్షలను విధించిందని, వీటిని […] The post కశ్మీర్‌పై కేంద్రానికి మరింత సమయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధించిన నిషేధాజ్ఞలన్నిటినీ ఎత్తి వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై తక్షణం ఎలాంటి ఆదేశాలను జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడాని కి కేంద్రానికి కొంత సమయం ఇచ్చి చూస్తామని అంటూ కేసు తదుపరి విచారణను మరో రెండువారాలకు వాయిదా వేసింది. ఆర్టికల్ 370ని రద్దుచేసిన తర్వాత కేంద్రం జమ్మూకశ్మీర్ ఓ అత్యంత కఠినమైన ఆంక్షలను విధించిందని, వీటిని ఎత్తివేయాలని ఆదేశించాలంటూ కాంగ్రెస్‌కు చెందిన తెహ్‌సీన్ పూనావాలా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. రాష్ట్రంలో అన్ని రకాల ఆంక్షలను విధించారని పిటిషనర్ పూనావాలా ఆరోపించారు. దీనిపై ధర్మాసనం అక్కడి పరిస్థితిని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకుంది.

రోజురోజుకు జమ్మూ, కశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడుతోందని, త్వరలోనే మామూ లు పరిస్థితులను పునరుద్ధరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని వేణుగోపాల్ తెలిపారు. క్రమంగా ఆంక్షలను సడలించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. 2016లో దాదాపు మూడు నెలల పాటు కఠిన ఆంక్షలు విధించారని, 46 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేస్తూ, ప్రస్తుతం అలాంటి ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదని చెప్పారు. మరి కొద్ది రోజుల్లోనే కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులలు నెలకొంటాయని అటార్నీ జనరల్ ధర్మాసనానికి తెలియజేశారు. రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. అక్కడి జిల్లాల్లో పరిస్థితుల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. అటార్నీ జనరల్ సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న బెంచ్ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రానికి కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

SC refuses to pass order on restoring communication

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కశ్మీర్‌పై కేంద్రానికి మరింత సమయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.