15న అమిత్ షా కశ్మీర్ పర్యటన?

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భం గా ఈ నెల 15న కేంద్ర హోంమంత్రి అమి త్ షా కశ్మీర్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని మంగళవారం తొలుత మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే గురువారం అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటించడం అనే ది అక్కడి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని హోం శాఖ అధికారి ఒకరు చెప్పారు. అమిత్ షా ఈ నెల 15 న జమ్మూ, కశ్మీర్‌లో పర్యటించాలనే ఆలోచన అయితే ఉంది […] The post 15న అమిత్ షా కశ్మీర్ పర్యటన? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భం గా ఈ నెల 15న కేంద్ర హోంమంత్రి అమి త్ షా కశ్మీర్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని మంగళవారం తొలుత మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే గురువారం అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటించడం అనే ది అక్కడి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని హోం శాఖ అధికారి ఒకరు చెప్పారు. అమిత్ షా ఈ నెల 15 న జమ్మూ, కశ్మీర్‌లో పర్యటించాలనే ఆలోచన అయితే ఉంది కానీ దీనిపై ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని ఆ అధికారి తెలిపారు. కాగా, గత వారం రోజులుగా కశ్మీర్ లోయలోనే ఉంటున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ నెల 15 దాకా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం తో పాటుగా రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడానికి ఉద్దేశించిన బిల్లులను అమిత్ షా ఇటీవల పార్లమెంటు లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాల్లో ప్రధాని మోడీతో పాటుగా అమిత్ షా కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో జాతీయ జెండాను ఎగురవేయాలని అమిత్ షా అనుకుంటున్నట్లు ఇంతకు ముందు వార్తలు వచ్చాయి.

Amit Shah might visit Srinagar to unfurl tricolour

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 15న అమిత్ షా కశ్మీర్ పర్యటన? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: