సమరోత్సాహంతో ఆస్ట్రేలియా

ఇంగ్లండ్‌కు సవాల్, నేటి నుంచి యాషెస్ రెండో టెస్టు లండన్: తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా బుధవారం ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే యాషెస్ రెండో మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో మరింత పైచేయి సాధించాలని తహతహలాడుతోంది. చారిత్రక లార్డ్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, ఆతిథ్య ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ సవాలుగా మారింది. ప్రపంచకప్ గెలిచి జోరుమీదున్న ఇంగ్లండ్‌కు తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో అవమానకర రీతిలో ఓటమి […] The post సమరోత్సాహంతో ఆస్ట్రేలియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇంగ్లండ్‌కు సవాల్, నేటి నుంచి యాషెస్ రెండో టెస్టు
లండన్: తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా బుధవారం ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే యాషెస్ రెండో మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో మరింత పైచేయి సాధించాలని తహతహలాడుతోంది. చారిత్రక లార్డ్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, ఆతిథ్య ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ సవాలుగా మారింది. ప్రపంచకప్ గెలిచి జోరుమీదున్న ఇంగ్లండ్‌కు తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో అవమానకర రీతిలో ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించడ అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఆ జట్టులో ఉన్నారు. దీంతో ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ కూడా సవాలుగా తయారైంది. సమష్టిగా రాణించడం ఒక్కటే ఇంగ్లండ్ ముందున్న ఏకైక మార్గం. కిందటి మ్యాచ్‌లో ఓపెనర్ రోరి బర్న్ ఒక్కడే రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. మిగిలిన వారిలో కెప్టెన్ జోరూట్ మాత్రమే పర్వాలేదనిపించాడు. మిగతావారు విఫలం కావడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది.

కానీ, ఈ మ్యాచ్‌లో అలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని భావిస్తోంది. ఇక, ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ స్మిత్ శతకాలతో చెలరేగాడు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. తొలి టెస్టులో విఫలమైన స్టార్ ఆటగాడు డేవిడ్ వార్న ఈసారి బ్యాట్‌ను ఝులిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక, బెన్‌క్రాఫ్ట్ కూడా ఇదే లక్షంతో పోరుకు సిద్ధమయ్యాడు. ఉస్మాన్ ఖ్వాజా, ట్రావిస్ హెడ్, మాథ్యూవేడ్ తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక కిందటి మ్యాచ్‌లో హెడ్, వేడ్‌లు బాగానే ఆడారు. వేడ్ సెంచరీతో అలరించాడు. ఇక, బౌలింగ్‌లో కూడా ఆస్ట్రేలియా బాగానే కనిపిస్తోంది. కమిన్స్, లియాన్, పాటిన్సన్, సిడిల్‌లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో బలంగా ఉన్న ఆస్ట్రేలియా మరో విజయంపై కన్నేసింది.

ENG vs AUS Yashes 2nd match today

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సమరోత్సాహంతో ఆస్ట్రేలియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.