13 ఏళ్ల తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఆమె తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ షూటింగ్లో విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి విజయశాంతికి గ్రాండ్‌గా వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “ఈ 13 ఏళ్లలో ఏం మారలేదు.
అదే క్రమశిక్షణ, అదే ఆటిట్యూడ్, ఆదే డైనమిజమ్.. వెల్కమ్ ఆన్ బోర్డ్ విజయశాంతిగారు” అంటూ అనిల్ రావిపూడి ఆమెకు స్వాగతం చెప్పారు. ఈ సినిమాలో విజయశాంతి క్యారెక్టర్ ఏంటనేది ఇంకా తెలియరాలేదు. కానీ ఆమె కోసం ఖచ్చితంగా ఏదో పవర్ఫుల్ క్యారెక్టర్‌నే డిజైన్ చేసి ఉంటాడు అనిల్ రావిపూడి. అందులోనూ లేడీస్ రోల్స్‌ని డిజైన్ చేయడంలో అనిల్‌ది అందె వేసిన చెయ్యి. విజయశాంతి కోసం అతను ప్రత్యేకమైన క్యారెక్టర్‌ను డిజైన్ చేసి ఉంటాడని చెప్పవచ్చు. మహేష్ ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ అజయ్‌కృష్ణగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Anil Ravipudi who says Well Come to Vijay Shanti
Related Images:
[See image gallery at www.manatelangana.news]The post 13 ఏళ్లలో ఏం మారలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.