స్టెమ్‌లో అరుదైన గౌరవం

  ప్రవాస భారతీయ మహిళలైన ఇద్దరికీ అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్‌లో జరగనున్న 2019 విమెన్ ఆఫ్ కలర్ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మాథ్స్(స్టెమ్) సదస్సులో పురస్కారాలు అందుకోనున్నారు. స్టెమ్ విభాగంలో అత్యుత్తమంగా రాణిస్తున్న 50 మందికి పైగా మహిళల్ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అందులో ఒకరు బోయింగ్ కంపెనీ డిజిటల్ కామన్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ ‘మోనికా పంపాలియా’. ఆమె ‘డైవర్సిటీ లీడర్‌షిప్-గవర్నమెంట్’ అవార్డుకు ఎంపికయింది. మోనిక పుణెలో ఇంజినీరింగ్ విద్య పూర్తి […] The post స్టెమ్‌లో అరుదైన గౌరవం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రవాస భారతీయ మహిళలైన ఇద్దరికీ అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్‌లో జరగనున్న 2019 విమెన్ ఆఫ్ కలర్ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మాథ్స్(స్టెమ్) సదస్సులో పురస్కారాలు అందుకోనున్నారు. స్టెమ్ విభాగంలో అత్యుత్తమంగా రాణిస్తున్న 50 మందికి పైగా మహిళల్ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అందులో ఒకరు బోయింగ్ కంపెనీ డిజిటల్ కామన్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ ‘మోనికా పంపాలియా’. ఆమె ‘డైవర్సిటీ లీడర్‌షిప్-గవర్నమెంట్’ అవార్డుకు ఎంపికయింది. మోనిక పుణెలో ఇంజినీరింగ్ విద్య పూర్తి చేశారు.

వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. ఆరేళ్లుగా బోయింగ్ కంపెనీలో పని చేస్తున్నారు. ఆమెతోపాటు భారతదేశానికి చెందిన ‘మనాలిని’ సైతం ఈ అవార్డును అందుకోనున్నారు. పుణెలో చదివిన ఆమె క్వికెన్ లోన్స్‌లో ఏడేళ్లుగా చేస్తున్నారు. అదే సంస్థలో రాకెట్ మార్టిగేజ్ టెక్నాలజీకి ఆరునెలల నుంచి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సదస్సులో అవార్డులు అందుకోబోతున్న మహిళలు ప్రభుత్వ, పారిశ్రామిక రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి వివిధ సంస్థలు, సంఘాలను బలోపేతం చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు.

Two Extraordinary Indian American Women in STEM

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post స్టెమ్‌లో అరుదైన గౌరవం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: