నా కెరీర్‌లో కొత్తదనం చూపిస్తున్నా: నాగార్జున

  నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వయాకామ్ 18 స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘మన్మథుడు 2’. నాగార్జున, పి.కిరణ్ నిర్మించిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. ఆదివారం జరిగిన సినిమా సక్సెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ “అప్పుడు ఎప్పుడో తెలుగు సినిమాలకు 8 జాతీయ అవార్డులు వచ్చాయి. ఆతర్వాత అవార్డులు రావడం తగ్గిపోయాయి. ఇప్పుడు 7 అవార్డులు వచ్చాయి. ఇందులో రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ […] The post నా కెరీర్‌లో కొత్తదనం చూపిస్తున్నా: నాగార్జున appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వయాకామ్ 18 స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘మన్మథుడు 2’. నాగార్జున, పి.కిరణ్ నిర్మించిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. ఆదివారం జరిగిన సినిమా సక్సెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ “అప్పుడు ఎప్పుడో తెలుగు సినిమాలకు 8 జాతీయ అవార్డులు వచ్చాయి. ఆతర్వాత అవార్డులు రావడం తగ్గిపోయాయి. ఇప్పుడు 7 అవార్డులు వచ్చాయి. ఇందులో రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ‘చి.ల.సౌ’కు అవార్డు రావడం… ఆ సినిమా నిర్మాతల్లో నేను ఒకడిని కావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

‘మహానటి’ సినిమాలో నటించిన కీర్తిసురేశ్‌కు ఉత్తమనటి అవార్డు వచ్చింది. అలాగే రంగస్థలం, అ..!. సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. ఇక నేను ఎప్పుడూ నా కెరీర్‌లో కొత్తదనం చూపిస్తున్నాను. ఈ మేరకు సినిమాలు చేస్తూ వచ్చాను. ఒకే టైప్ సినిమాలు చేయడం నాకు నచ్చదు. అందుకే కెరీర్ ప్రారంభంలో ‘గీతాంజలి’ సినిమా చేశాను. ఫస్ట్ టైమ్ రెగ్యులర్ సినిమాకు భిన్నంగా ఆ సినిమా చేశాను. ఇప్పుడు ఆ సినిమా కల్ట్ క్లాసిక్. అలాగే ‘శివ’ చిత్రం తర్వాత ‘నిర్ణయం’ చేశాను. ఇప్పుడు ‘నిర్ణయం’ చిత్రాన్ని మంచి సినిమా అంటారు. ఇక ‘అన్నమయ్య’ సినిమా 8వ రోజు కలెక్షన్స్ రెంట్స్ కూడా కట్టలేని పరిస్థితికి చేరుకున్నాయి. నేను, రాఘవేంద్రరావు, దొరస్వామిరాజు చాలా బాధపడ్డాం. చాలా మంచి సినిమా చేశామనుకున్నాం. అప్పుడు ఓ టూర్ వెళ్లినా కూడా వర్కవుట్ కాలేదు.

అయితే 11వ రోజు ఏం జరిగిందో ఏమో కానీ.. మ్యాట్నీ నుండి అన్ని థియేటర్స్ హౌస్‌ఫుల్స్ అయ్యాయి. ఆ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. నాకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అలాగని ఇప్పుడు నేను ఆ సినిమాలతో ‘మన్మథుడు 2’ని పోల్చాలని అనుకోవడం లేదు. ‘మన్మథుడు’ కూడా విడుదలైనప్పుడు డైరెక్టర్ విజయ్ భాస్కర్ వచ్చి.. ‘ఎక్కడో తప్పు చేశాం సార్’ అని అన్నారు. ‘ఏం లేదండి.. కొత్త రకమైన సినిమా, కొత్త డైలాగ్స్, సమయం పడుతుంది’ అని చెప్పాను. ఆతర్వాత ఆ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించింతో తెలిసిందే. నాలో కొత్తదనం చూసుకోవాలి అని ఆలోచించి ‘మన్మథుడు 2’ చేశాను. నేను ప్రయోగాలు చేసే ఇక్కడి వరకు వచ్చాను. ఈ చిత్రాన్ని కూడా అలాగే చేశాం. కలెక్షన్స్ చూసి చాలా సంతోషమేసింది.

అందరూ ఫోన్స్ చేసి అభినందిస్తున్నారు. ఒక పక్క బిగ్‌బాస్ సంతోషం.. మరో పక్క ఇదొక సంతోషం. తల్లికొడుకుల మధ్య అనుబంధం, తల్లి పడే తాపత్రయం, నాకు, వెన్నెల కిషోర్ మధ్య ఉండే కామెడీ… అన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయి. రకుల్ అద్భుతంగా నటించింది”అని అన్నారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ “ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాగార్జున, వెన్నెల కిషోర్ కామెడీ, అవంతిక క్యారెక్టర్ అందరికీ నచ్చేసింది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత పి.కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.

I am doing something new in my career: Nagarjuna

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నా కెరీర్‌లో కొత్తదనం చూపిస్తున్నా: నాగార్జున appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: