చిరు మెసేజ్ తో నాకు గూస్‌బంప్: ప్రభాస్

  హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్, బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ కలిసి నటించిన సాహో సినిమా ట్రైలర్ ను శనివారం చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక, ఈ నెల 30న సాహో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం చిత్ర […] The post చిరు మెసేజ్ తో నాకు గూస్‌బంప్: ప్రభాస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్, బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ కలిసి నటించిన సాహో సినిమా ట్రైలర్ ను శనివారం చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక, ఈ నెల 30న సాహో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం చిత్ర యూనిట్ నగరంలో మీడియాతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలతో పాటు సాహో విశేషాలను ప్రభాస్ మీడియాకు వివరించాడు. ‘సాహో ట్రైలర్ చూసిన సినీ ప్రముఖులు కూడా బాగా స్పందించారు. ముఖ్యంగా సాహో ట్రైలర్ చూసి చిరంజీవి గారు మెసేజ్ చేశారు. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెంటనే ఆయనకు ఫోన్ చేశాను. ట్రైలర్ చాలా బాగుందంటూ ఆయన ప్రశంసించడంతో నాకు గూస్‌బంప్ వచ్చాయి. రాజమౌళి కూడా సాహో ట్రైలర్ నచ్చిందని మెసేజ్ చేశారు’ అని ప్రభాస్ తెలిపాడు.

Saaho Movie Team Press Meet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిరు మెసేజ్ తో నాకు గూస్‌బంప్: ప్రభాస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: