కశ్మీర్ ప్రజల మద్దతే ముఖ్యం

  1980వ దశకంలో పాకిస్థాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా స్థానిక ఉగ్రవాదులు పోరాడిన సందర్భం ఉంది. ఆ సమయంలో వారికే అండగా కేంద్ర ప్రభుత్వం లేకపోవడం కారణంగానే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కాశ్మీర్ లోయలో విస్తరించిందని మరువలేము. ఉగ్రవాదం పట్ల కాశ్మీరీ పార్టీలు ద్వంద వైఖరి అనుసరిస్తూ వస్తున్నాయి. కేవలం వాజపేయి మాత్రమే కాశ్మీరీ ప్రజల విశ్వాసం చూరగొని, అక్కడ ప్రశాంతత నెలకొల్పే ప్రయత్నం నిజాయతీతో చేశారు. రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు సహితం కొంతమేరకు […] The post కశ్మీర్ ప్రజల మద్దతే ముఖ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

1980వ దశకంలో పాకిస్థాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా స్థానిక ఉగ్రవాదులు పోరాడిన సందర్భం ఉంది. ఆ సమయంలో వారికే అండగా కేంద్ర ప్రభుత్వం లేకపోవడం కారణంగానే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కాశ్మీర్ లోయలో విస్తరించిందని మరువలేము. ఉగ్రవాదం పట్ల కాశ్మీరీ పార్టీలు ద్వంద వైఖరి అనుసరిస్తూ వస్తున్నాయి. కేవలం వాజపేయి మాత్రమే కాశ్మీరీ ప్రజల విశ్వాసం చూరగొని, అక్కడ ప్రశాంతత నెలకొల్పే ప్రయత్నం నిజాయతీతో చేశారు. రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు సహితం కొంతమేరకు చేయగలిగినా ఆ తరువాత అటువంటి ప్రయత్నాలు జరగనే లేదు. కాశ్మీర్ ప్రజల విశ్వాసం పొందే ప్రయత్నం చేయకుండా కాశ్మీర్ సంపూర్ణ విలీనం సాధ్యం కాదని గ్రహించాలి. అందుకు నిజాయతీతో ప్రయత్నాలు జరగాలి.

జమ్మూ కాశ్మీర్ విలీనం సంపూర్ణం కావించే రీతిలో చారిత్రాత్మకమైన బిల్లులకు పార్లమెంట్ లో అనూహ్యంగా ఆమోదం పొందటం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక నూతన చరిత్రను సృష్టించారు. తొలి నుండి కాశ్మీర్ విలీనం సందర్భంగా స్వాతంత్య్రం వచ్చిన సమయంలో జరిగిన సంఘటనలు వివాదాస్పదంగా ఉంటూ వచ్చాయి. దేశంలో మిగిలిన సంస్థానాల విలీనం విషయంలో అనుసరించిన పక్రియను ఇక్కడ నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు అనుసరించలేదనే విమర్శలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు రావడానికి ముఖ్యంగా బ్రిటిష్ వలస పాలకులే కారకులు. ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకమైనది కావడంతో దానిని పాకిస్థాన్ కు అప్ప చెప్పడం ద్వారా, తమ ఆధీనంలో ఉంచుకోవచ్చని ఎత్తుగడ వేశారు. ఇక్కడ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొని అటు రష్యాను, ప్రక్కన ఉన్న చైనాను, సమీపంలో ఉన్న జపాన్ ను కూడా కట్టడి చేయవచ్చని వ్యూహరచన జరిపారు.

వాస్తవానికి నాటి వైస్ రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ శ్రీనగర్ వెళ్లి, వారం రోజులపాటు మకాం వేసి అందుకు రాజా హరిసింగ్ ను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈ ప్రతిపాదనకు నెహ్రు, పటేల్ కూడా ఒప్పుకున్నట్లు చెప్పారు. అయితే అందుకు ఆయన విముఖత వ్యక్తం చేయడంతో వెనుతిరిగిరాక తప్పలేదు. నెహ్రు మొదటి నుండి కాశ్మీర్ పాలనా బాధ్యతలను షైక్ అబ్దుల్లాకు అప్పచెప్పాలని పట్టుదలగా ఉన్నారు. అందుకు రాజా హరిసింగ్ విముఖంగా ఉన్నారు. ఆ సమయంలో అబ్దుల్లా జైలులో ఉన్నారు. అందుకనే భారత్ లో విలీనంపై రాజా హరిసింగ్ మీనమేషాలు లెక్కపెట్ట వలసి వచ్చింది. చివరకు పాకిస్థాన్ కాశ్మీర్ ను కంబళించే కుట్ర చేయడంతో విధిలేక భారత్ లో విలీనం కావించవలసి వచ్చింది.

అప్పట్లో భారత్ లో విలీనపత్రంపై సంతకం చేసిన ప్రతి సంస్థానం కూడా తమ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధి సభలో భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నట్లు తీర్మానం చేయవలసి ఉంది. కానీ ఆ సమయంలో కాశ్మీర్ లో ఎన్నికైన అసెంబ్లీ లేకపోవడంతో, ఆ విధంగా అసెంబ్లీ ఏర్పాటై భారత రాజ్యాంగాన్ని లాంఛనంగా ఆమోదించేవరకు భారత రాజ్యాంగం వర్తించే విధంగా కేవలం తాత్కాలిక ప్రాతిపదికన ఆర్టికల్ 370ని రూపొందించారు. హైదరాబాద్ సంస్థానంలో ప్రజలంతా భారత్ లో విలీనం కావాలని కోరుకొంటూ ఉంటే ఇక్కడి పాలకుడు నిజాం ఒప్పుకోవడం లేదని నెహ్రు తటపాయిస్తు వచ్చారు. కానీ కాశ్మీర్ విషయంలో అక్కడి పాలకుడు విలీనంకు సుముఖంగా ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు, అంటే ఆయన దృష్టిలో షైక్ అబ్దుల్లా సుముఖంగా లేరంటూ పేచీలు పెడుతూ వచ్చారు. ఒక విధంగా ద్వంద వైఖరి అనుసరించారు.

అయితే చైనా యుద్ధంలో ఓటమి తర్వాత నెహ్రు తన పొరపాటును గ్రహించారు. సరిగ్గా 56 సంవత్సరాల క్రితం 1963 డిసెంబర్ 27న లోక్ సభలో మాట్లాడుతూ ఆర్టికల్ 370ను చెరిపి వేయాలని, కాశ్మీర్ విలీనం సంపూర్ణం కావాలని స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, కొద్దీ నెలలకే మృతి చెందడంతో ఆయన ఆ పక్రియను పూర్తి చేయలేక పోయారు. నాటి నెహ్రు ఇచ్చిన హామీని నేడు మోదీ ప్రభుత్వం నెరవేర్చిన్నట్లు చెప్పవచ్చు.

నెహ్రు మంత్రివర్గంలో హోమ్ మంత్రిగా ఉన్న గుర్జలాల్ నందా అయితే ఆర్టికల్ 370 అంటే లోపల ఖాళీగా ఉన్నటువంటి ఒక గుల్ల వంటిదని, దానిలో ఏమీ లేదని, ఎప్పుడు కావలి అనుకొంటే అప్పుడు – ఒక రోజులో, 10 రోజులలో, 10 నెలల్లో అంతం చేయవచ్చని లోక్ సభలో చెప్పారు. అయితే నెహ్రు తర్వాత కాంగ్రెస్ నేతలు ఎవ్వరు అటువంటి ప్రయత్నం చేయలేదు. పైగా ఆర్టికల్ 370 అనేడిది లౌకిక వాదానికి చిహ్నం అంటున్నట్లు, భారత్ లో కాశ్మీర్ అనుబంధానికి వారధి అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు.

జన సంఘ్ రోజుల నుండి బీజేపీ నేతలు ఈ విషయంలో స్పష్టమైన విధానం అనుసరిస్తున్నారు. తమ ఎన్నికల ప్రణాళికలలో పేర్కొంటున్నారు. అందుకనే అదను చూసి, వ్యూహాత్మకంగా జమ్మూ కాశ్మీర్ కున్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించివేశారు. ఈ ప్రత్యేక ప్రతిపత్తి కేవలం కాశ్మీర్ లోయలోని రెండు కుటుంబాలకు రాజకీయాలను అడ్డం పెట్టుకొని అధికారం చెలాయించడాన్ని మాత్రమే వీలయిన్నట్లు నేడు పలు వర్గాల నుండి విమర్శలు చెలరేగుతున్నాయి.
దేశంలో ఒక విధంగా ఈ అంశంపై ఏకాభిప్రాయం ఏర్పడినట్లు పార్లమెంట్ లో పార్టీలకు అతీతంగా లభించిన మద్దతు స్పష్టం చేస్తున్నది. బిజెపి నీడ కూడా గిట్టని మాయావతి, కేజ్రీవాల్ వంటి వారు కూడా మద్దతు తెలిపారు. చివరకు తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ లలో సహితం ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు.

ఈ విషయంలో ప్రభుత్వ చర్యను వ్యతిరేకించిన పక్షాలు, నాయకులు సహితం జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో, అసెంబ్లీ లేని సమయంలో ఇటువంటి కీలక చట్టాలు తీసుకు రావడాన్ని మాత్రమే వ్యతిరేకించారు. అంతేగాని ప్రభుత్వ చర్యలను మాత్రం వ్యతిరేకించక పోవడం గమనార్హం. ఆర్టికల్ 370 స్థాయి గురించి స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయలేక పోయారు. ఉగ్రవాదం పడగలేయడం ప్రారంభమైనప్పటి నుండి కాశ్మీరీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, లేనప్పుడు మరో విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. అధికారం లేనప్పుడు ఉగ్రవాదుల భాష ప్రయోగిస్తున్నారు. వేర్పాటువాదులు సహితం ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్నవారు సహితం స్పష్టమైన విధానం అనుసరించక పోవడం జరుగుతూ వచ్చింది.

అయితే ఈ సందర్భంగా జరిగిన చర్చలో డీఎంకే సభ్యుడు టి ఆర్ బాలు లోక్ సభలో వేసిన ప్రశ్న ప్రాముఖ్యత సంతరింప చేసుకొంది. ఈ చర్యల ద్వారా ఏమి సాధించాలి అనుకొంటున్నారు ? అంటూ ప్రశ్నించారు. కాశ్మీర్ లోయలోని ప్రజలను విశ్వాసంలోకి తీసుకుకుండా, వారిలో నమ్మకం కలిగించే చర్యలు చేపట్టకుండా సైన్యాన్ని భారీగా మోహరింపచేసి తీసుకొనే చర్యలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనే అనుమానాలు కలుగక మానవు.

ఢిల్లీ పాలకులు తమ పట్ల వివక్షత చూపుతున్నారనే అభిప్రాయం కాశ్మీరీ ప్రజలలో తీవ్రంగా నెలకొంది. 1980వ దశకంలో పాకిస్థాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా స్థానిక ఉగ్రవాదులు పోరాడిన సందర్భం ఉంది. ఆ సమయంలో వారికే అండగా కేంద్ర ప్రభుత్వం లేక పోవడం కారణంగానే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కాశ్మీర్ లోయలో విస్తరించిందని మరువలేము. ఉగ్రవాదం పట్ల కాశ్మీరీ పార్టీలు ద్వంద వైఖరి అనుసరిస్తూ వస్తున్నాయి.

కేవలం వాజపేయి మాత్రమే కాశ్మీరీ ప్రజల విశ్వాసం చూరగొని, అక్కడ ప్రశాంతత నెలకొల్పే ప్రయత్నం నిజాయతీతో చేశారు. రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు సహితం కొంతమేరకు చేయగలిగినా ఆ తరువాత అటువంటి ప్రయత్నాలు జరగనే లేదు. కాశ్మీర్ ప్రజల విశ్వాసం పొందే ప్రయత్నం చేయకుండా కాశ్మీర్ సంపూర్ణ విలీనం సాధ్యం కాదని గ్రహించాలి. అందుకు నిజాయతీతో ప్రయత్నాలు జరగాలి. కాశ్మీర్ సమస్య సంక్లిష్టం కావడానికి పాకిస్థాన్ జరుపుతున్న ప్రచ్ఛన్న యుద్ధంతో పాటు భారత ప్రభుత్వం రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నం చేయక పోవడం కూడా ప్రధాన కారణం అని గ్రహించాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో సహితం రిటైర్డ్ అధికారులకు అప్పచెప్పడంతో పరిష్టితులు విషమిస్తూ వచ్చాయి. అయితే జమ్మూ కాశ్మీర్ చరిత్రలో మొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడు సత్పాల్ మాలిక్ ను గవర్నర్ గా నియమించడం, కేంద్ర హోమ్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే అమిత్ షా స్వయంగా కాశ్మీర్ అంశంపై దృష్టి పెట్టడంతో ఇప్పుడు చారిత్రాత్మక చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడినట్లు చెప్పవచ్చు.

ఇప్పుడు కాశ్మీర్ లో ప్రశాంతత నెలకొనడానికి రాజకీయ చొరవ అత్యవసరం. అందుకు రాజకీయ నాయకత్వం ప్రత్యక్షంగా బాధ్యత వహించాలి. గవర్నర్ మాలిక్ తో కలసి అమిత్ షా అందుకు పూనుకోవాలి. స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, వారి విశ్వాసం పొందేందుకు సహనంతో వ్యవహరించాలి. ఈ విషయంలో సాయుధ దళాల పాత్ర పరిమితంగా ఉంటాయని గ్రహించాలి.

Jammu and Kashmir merger bill passed in Parliament

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కశ్మీర్ ప్రజల మద్దతే ముఖ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.