జన జాతరగా.. కాళేశ్వరం జలజాతర…

  గోదావరి తీరానికి పోటెత్తిన రామగుండం ప్రజలు గోదావరిఖని : కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు గోదావరిఖనిలో గోదావరి నదికి చేరుకుని జలకళ సంతరించుకున్న శుభ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కాళేశ్వర జల జాతర సామూహిక వనభోజనాల కార్యక్రమం జన జాతరను తలపించింది. ఎమ్మెల్యే పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలోని పల్లె పల్లె, కార్పోరేషన్ పరిధిలోని వివిధ డివిజన్ల నుండి ప్రజలు ర్యాలీలుగా తరలి వచ్చారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం […] The post జన జాతరగా.. కాళేశ్వరం జలజాతర… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గోదావరి తీరానికి పోటెత్తిన రామగుండం ప్రజలు

గోదావరిఖని : కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు గోదావరిఖనిలో గోదావరి నదికి చేరుకుని జలకళ సంతరించుకున్న శుభ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కాళేశ్వర జల జాతర సామూహిక వనభోజనాల కార్యక్రమం జన జాతరను తలపించింది. ఎమ్మెల్యే పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలోని పల్లె పల్లె, కార్పోరేషన్ పరిధిలోని వివిధ డివిజన్ల నుండి ప్రజలు ర్యాలీలుగా తరలి వచ్చారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టిబిజికెఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి నేతృత్వంలో యూనియన్ నాయకులు, సింగరేణి కార్మికులు వందలాది మంది పట్టణ ప్రధాన చౌరస్తా నుండి డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలతో భారీ ర్యాలీగా బయలుదేరి గోదావరి నదీ తీరానికి చేరుకున్నారు.

జియం కాలనీ 11వ డివిజన్ నుండి నాయకులు దామ నర్సయ్య ఆధ్వర్యంలో జల జాతరకు కుటుంబ సమేతంగా నాయకులు ఉప్పు రాంచందర్, వాలా ప్రసాదరావు, పుట్ట రమేష్, జంగిలి రాజేష్, శ్రీనివాస్, బానాకర్ తదితరులు సామూహిక వనభోజన మహోత్సవానికి తరలి వెళ్లారు. ఆదివారం పట్టణ దారులన్నీ గోదావరి వైపే సాగడం కనిపించింది. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో జాతరకు తరలిరాగా, మరికొంత మంది తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో వేడుకలకు సరికొత్త కళను తెచ్చారు. డోలు వాయిద్య కళాకారులు చిందులు వేస్తూ ముందుకు సాగగా కోలాట బృందాలు తమ నృత్యాలతో అనుసరించారు. బోనాలు, బతుకమ్మలు, పోతరాజులు వేదికను చేరుకుంటూ జల జాతరను జన జాతరగా మార్చారు.

Waters of Kaleshwaram reached Godavari River

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జన జాతరగా.. కాళేశ్వరం జలజాతర… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: