సూక్ష్మసేద్యంతో నీటి పొదుపు

మన తెలంగాణ/హైదరాబాద్: సూక్ష్మసేద్యం పరికరాల అమర్చడం వల్ల గణనీయంగా నీటి పొదుపు జరిగింది. దీనికి తోడు ఎరువులు, విద్యుత్, కూలీల ఖర్చులో ఆదా, 50 నుంచి 70 శాతం వరకు దిగుబడి పెరిగింది. నాబార్డు అనుబంధ సంస్థ నాబ్కా న్స్ అధ్యయనంలో సూక్ష్మ సేద్యంలో రైతుల కు ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా లబ్ధి చేకూ రినట్లు తేల్చారు. ఇది మొత్తం ఏడేళ్లకు కలిపి సుమారుగా రూ.36 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఉద్యాన అభివృద్ధి మండలి […] The post సూక్ష్మసేద్యంతో నీటి పొదుపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: సూక్ష్మసేద్యం పరికరాల అమర్చడం వల్ల గణనీయంగా నీటి పొదుపు జరిగింది. దీనికి తోడు ఎరువులు, విద్యుత్, కూలీల ఖర్చులో ఆదా, 50 నుంచి 70 శాతం వరకు దిగుబడి పెరిగింది. నాబార్డు అనుబంధ సంస్థ నాబ్కా న్స్ అధ్యయనంలో సూక్ష్మ సేద్యంలో రైతుల కు ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా లబ్ధి చేకూ రినట్లు తేల్చారు. ఇది మొత్తం ఏడేళ్లకు కలిపి సుమారుగా రూ.36 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఉద్యాన అభివృద్ధి మండలి సమావేశం ఉద్యాన శాఖ కార్యాలయంలో మంగళవారం నాడు జరిగింది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి అధ్యక్ష తన జరిగిన ఈ సమావేశంలో ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యా లయం రిజిస్ట్రార్ డాక్టర్ రవీందర్ రెడ్డి, అగ్రోస్ విసి, ఎండి సురేందర్; వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, ఆర్ధిక శాఖ ఉప కార్యదర్శి శైలజ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో నాబార్డు నుంచి తీసుకున్న రూ.874 కోట్ల రుణంతో అమలు చేసిన సూక్ష్మసేధ్య ప్రాజెక్టుల కింద సాధించిన పురోగతి, లక్ష్యాలను వివరించారు. టిఎస్ ఐపాస్ ద్వారా సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్ యూనిట్‌కు లభించిన అనుమతుల గురించి చర్చించారు. కేంద్రం కిసాన్ సంపద పథకం కింద ఈ యూనిట్‌కు రూ.4.28 కోట్లు రాయితీగా మంజూరు చేసిందని వెంకట్రాంరెడ్డి తెలియజేశారు. దేశంలోనే మొదటిసారిగా ఈ పథకంలో రాయితీని తెలంగాణ అందుకుందని సంతోషం వ్యక్తపరిచారు.

Water savings with microcreditRelated Images:

[See image gallery at manatelangana.news]

The post సూక్ష్మసేద్యంతో నీటి పొదుపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: