కర్నాకటలో కూలిన సంకీర్ణ సర్కారు

సభలో బలాబలాలు అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 224 బలసరీక్షకు 21 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. వీరిలో కాంగ్రెస్ జెడిఎస్‌కు చెందిన వారు 17 మంది, ఇండిపెండెంట్లు 2 , బిఎస్‌పి వారు ఒక్కరు సభకు రాలేదు. దీనితో ఓటింగ్‌కు సభలో ఇప్పటి నికర బలం : 204. ఇందులో సంకీర్ణానికి 99 , బిజెపికి 105 ఓట్లు దక్కాయి. ఇక సభలో బలం నిరూపించుకోవల్సిన అద్భుత సంఖ్య 103. రెబెల్స్ రాజీనామాలకు ముందు అసెంబ్లీలో […] The post కర్నాకటలో కూలిన సంకీర్ణ సర్కారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సభలో బలాబలాలు
అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 224
బలసరీక్షకు 21 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. వీరిలో కాంగ్రెస్ జెడిఎస్‌కు చెందిన వారు 17 మంది, ఇండిపెండెంట్లు 2 , బిఎస్‌పి వారు ఒక్కరు సభకు రాలేదు. దీనితో ఓటింగ్‌కు సభలో ఇప్పటి నికర బలం : 204. ఇందులో సంకీర్ణానికి 99 , బిజెపికి 105 ఓట్లు దక్కాయి. ఇక సభలో బలం నిరూపించుకోవల్సిన అద్భుత సంఖ్య 103.
రెబెల్స్ రాజీనామాలకు ముందు అసెంబ్లీలో బలాబలాలు
అధికార పక్షం బలం 117. ఇందులో కాంగ్రెస్ 78. జెడిఎస్ 17. బిఎస్‌పి 1. నామినేటెడ్ 1, స్పీకర్ 1

బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో మంగళవారం కుప్పకూలింది. ప్రభుత్వానికి అనుకూలంగా 99, వ్యతిరేకంగా 105 ఓట్లు రావడంతో ప్రభుత్వం పడిపోయింది. దీనితో పలు సమస్యలు ప్రస్తుతం తీవ్రస్థాయి సంక్లిష్ట దశలతో సాగిన 14 నెలల సంకీర్ణ ప్రభుత్వానికి ఆరుగురు ఎమ్మెల్యేల తేడాతో కాలం చెల్లింది. క్యాంప్ రాజకీయాలు, వ్యూహ ప్రతివ్యూహాలు, సుప్రీంకోర్టు రూలింగ్‌ల నడుమ చివరికి జరిగిన విశ్వాస తీర్మానం సంబంధిత బలపరీక్షలో ప్రభుత్వం ఓడింది. ముఖ్యమంత్రి కుమారస్వామి తమ పదవికి ఆ తరువాత రాజీనామా చేశారు. గవర్నర్ వాజుభాయ్ వాలాకు ఆయన రాజీనామా సమర్పించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వరకూ ఆపద్ధర్మసిఎంగా ఉండాలని గవర్నర్ సూచించారు. తమ ప్రభుత్వంపై సిఎం కుమారస్వామి విశ్వాస తీర్మానం స్వయంగా ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘ కాలం పలురోజుల పాటు చర్చల ప్రక్రియ జరిగి చివరికి స్పీకర్ రమేష్ కుమార్ కీలక ఆదేశాలతో మంగళవారం ఓటింగ్ జరిగింది.

మంగళవారం సాయంత్రం జరిగిన ప్రక్రియలో ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకునే సంఖ్యాబలాన్ని చాటుకోలేకపోయింది. గత నెల రోజులుగా కర్నాటక సంకీర్ణంలో సంక్షోభం నెలకొని ఉంది. అధికార కూటమికి చెందిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో, వారి ముంబై క్యాంప్‌తో సంకీర్ణానికి చిక్కులు బిగుసుకున్నాయి. మంగళవారం నాటి బలపరీక్ష దశలో స్పీకర్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సభ తలుపులు మూసివేయాలని ఆదేశించారు. డివిజన్ పద్థతిలో ఓటింగ్‌కు దిగారు. స్పీకర్ ఆదేశాలతో అసెంబ్లీ కార్యాలయ సిబ్బంది వరుసల వారీగా సభ్యులను లెక్కించారు. ఈ దశలోనే అధికార పక్షం వైపు 99 మంది సభ్యులు ఉన్నట్లు, ప్రతిపక్ష వరుసలో 105 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. సభలో అధికారం స్థిరం చేసుకునే మ్యాజిక్ ఫిగర్ 103 . దీనిని అందుకోవడంలో సర్కారు విఫలం అయింది. కుప్పకూలింది. బలపరీక్ష కాగానే ప్రభుత్వ విశ్వాస తీర్మానం వీగిపోయిందని స్పీకర్ ప్రకటించారు. ఈ దశలో బిజెపి సభ్యులు కేరింతలతో నినాదాలకు దిగారు. సభలో ఓటింగ్ ప్రక్రియకు ఆదేశాలు బలపరీక్ష దశలో సిఎం కుమారస్వామి తమ స్థానంలో బాధతో కన్పించారు.
ప్రజాస్వామ్య విజయం : యడ్యూరప్ప
కుమారస్వామి బలపరీక్షలో ఓడిన తరువాత బిజెపి నేత యడ్యూరప్ప అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో విక్టరీ చిహ్నం చూపుతూ మాట్లాడారు. ఇప్పుడు ప్రజాస్వామిక విజయం చోటుచేసుకుందని అన్నారు. బిజెపి తరఫున కుమారస్వామిని సిఎంగా ప్రకటించేందుకు రంగం సిద్ధం అయిన దశలో , మరోసారి ఆయన కర్నాటక సిఎం అయ్యేదశలో ఆయన ఉత్సాహంతో మాట్లాడారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో పాలన లేకుండా పోయింది. ఇక రాష్ట్రాన్ని సరికొత్త దశకు తీసుకువెళ్లుతామన్నారు. రైతులు కరువు కాటకాలతో బాధపడతున్నారని, వారికి ఇకనైనా న్యాయం జరగాల్సి ఉందన్నారు.
నేడు బిజెపి శాసనసభా పక్షం భేటీ
యడ్యూరప్పను సిఎం అయ్యేందుకు రంగం
సిఎంగా యడ్యూరప్ప ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధం అయింది. బిజెపి శాసనసభా పక్షం బుధవారం బెంగళూరులో సమావేశం కానుంది. ఈ సందర్బంగా యడ్యూరప్పను ఏకగ్రీవంగా బిజపి నేతగా ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కూలే సర్కారు అని తెలుసు
బలపరీక్షకు ముందు సిఎం కుమారస్వామి భావోద్వేగంతో మాట్లాడారు. తమ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇది ఎక్కువ కాలం ఉండదని కూలుతుందని తనకు తెలుసునని కుమారాస్వామి చెప్పారు. తనకు సిఎం పదవి ముఖ్యం కాదన్నారు. తన ప్రత్యర్థుల వెన్నుదన్నులతో సాగిన సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పలు కథనాలు వచ్చాయని, దీనితో సిఎంగా ఉండటం వల్లనే ఈ విధంగా అవమానాలు చవిచూడాల్సి వచ్చిందనిపించిందని, తాను పదవిని వదులుకుంటున్నట్లు తెలిపారు. తనకు సంఖ్యాబలం లేదని తెలుసునని, అయినా బలపరీక్షకు ముందు పారిపోకుఇండా చివరి వరకూ నిలబడాలననే అనుకున్నానని తెలిపారు. సిఎం పదవి శాశ్వతం కాదని, రాష్ట్రానికి 23 మంది సిఎంలు వచ్చివెళ్లారని అన్నారు. నాలుగు రోజుల పాటు సాగుతూ వచ్చిన చర్చ తరువాత ఓటింగ్ దశ, ఓటమి తరువాత అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి ఎదురైందని, అయితే ఇదంతా కూడా రాజకీయ ఆటలో భాగం అన్నారు. బిజెపి వారు తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు పదేపదే యత్నిస్తూ వచ్చారని, అధికారంలోకి వస్తున్నామని సంతోషించవద్దని, ఆ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం ఉండదని, నిజానికి రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరిగితే మంచిదన్నారు. యడ్యూరప్ప మంత్రివర్గ కూర్పు దశలోనే లుకలుకల పేలుడు సంభవిస్తుందన్నారు. 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, వారి క్యాంప్‌లు కేవలం టోకు వ్యాపారంగా మారిందని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఒక్కో ఎమ్మెల్యేకు దాదాపు 30 కోట్ల రూపాయలు చెల్లించారని, ఈ సొమ్మంతా ఎక్కడి నుంచి వచ్చినట్లు అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి తాత్కాలిక ఓటమి ఎదురైందన్నారు. కర్నాటక అసెంబ్లీలో సంక్షోభానికి నాంది జులై 1వ తేదీన ఆరంభం అయింది. ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ తరువాత రాజీనామాల ప్రకంపనలు ఆరంభం అయ్యాయి.

Karnataka Political Crisis

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కర్నాకటలో కూలిన సంకీర్ణ సర్కారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: