బంగారం కన్నా థాయ్‌లాండ్‌లో నత్త శ్లేష్మం విలువ…

  నఖోన్‌నయోక్ : సెంట్రల్ ధాయ్‌లాండ్‌లో నత్త శ్లేష్మానికి, నత్త విసర్జన అవశేషాలకు ఎంతో విలువ పలుకుతోంది. నత్తలను సేంద్రీయ ఆహారంగా కూడా వాడుతున్నారు. ఒకప్పుడు రైతులు తమ పొలాల్లోంచి నత్తలను ఏరి పారేసేవారు. ఇప్పుడు వాటిని అమ్ముకుని బాగా సంపాదించ గలుగుతున్నారు. ఫెటినిసిరి థాంగ్‌కీయవ్ అనే ఆమె పొలంలో వెయ్యి నత్తలను పెంచుతోంది. వాటి నుంచి నెలకు 320 నుంచి 650 డాలర్ల వరకు ఆర్జించ గలుగుతోంది. థాయ్‌లాండ్‌లో నఖోన్‌నయోక్ రాష్ట్రంలో 80 నత్తల వ్యవసాయ […] The post బంగారం కన్నా థాయ్‌లాండ్‌లో నత్త శ్లేష్మం విలువ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నఖోన్‌నయోక్ : సెంట్రల్ ధాయ్‌లాండ్‌లో నత్త శ్లేష్మానికి, నత్త విసర్జన అవశేషాలకు ఎంతో విలువ పలుకుతోంది. నత్తలను సేంద్రీయ ఆహారంగా కూడా వాడుతున్నారు. ఒకప్పుడు రైతులు తమ పొలాల్లోంచి నత్తలను ఏరి పారేసేవారు. ఇప్పుడు వాటిని అమ్ముకుని బాగా సంపాదించ గలుగుతున్నారు. ఫెటినిసిరి థాంగ్‌కీయవ్ అనే ఆమె పొలంలో వెయ్యి నత్తలను పెంచుతోంది. వాటి నుంచి నెలకు 320 నుంచి 650 డాలర్ల వరకు ఆర్జించ గలుగుతోంది. థాయ్‌లాండ్‌లో నఖోన్‌నయోక్ రాష్ట్రంలో 80 నత్తల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. బ్యాంకాక్ నుంచి రెండు గంటలు ప్రయాణిస్తే ఈ వ్యవసాయ క్షేత్రాలకు చేరుకోవచ్చు.

ప్రపంచ స్థాయిలో ఇక్కడ ఈ 314 మిలియన్ డాలర్ల వరకు మార్కెట్ సాగుతోందని కొహెరెంట్ మార్కెట్ ఇన్‌సైట్స్ రీసెర్చి గ్రూప్ అంచనా వేసింది. నత్త గ్రంధుల నుంచి పాలు మాదిరి వచ్చే ఈ విలువైన శ్లేష్మాన్ని నీటితో జల్లి అమ్ముతున్నారు. దీని ముడి పదార్ధాన్ని ఏడెన్ ఇంటర్నేషనల్‌కు అమ్ముతున్నారు. థాయ్ కేంద్రంగా ఏడెన్ ఇంటర్నేషనల్ కాస్మోటిక్ కంపెనీగా ఉంటోంది. ఈ కంపెనీ తన ఉత్పత్తులను కొరియా, అమెరికా దేశాలకు నౌకల ద్వారా పంపిస్తోంది. ఏడెన్ కంపెనీ ఈ నత్త శ్లేష్మాల వ్యాపారాన్ని మూడేళ్ల క్రితం ప్రారంభించింది. నత్తశ్లేష్మం పౌడరు కిలోగ్రాము 58,200 డాలర్లకు అమ్ముతున్నారు. అక్కడ బంగారం కిలో 46,300 డాలర్లు పలకగా అంతకంటే ఎక్కువ ధర నత్తశ్లేష్మం పలకడం విశేషం.

ఏడెన్ తాలూకు నత్త శ్లేష్మ ద్రవంతో పోల్చుకుంటే చైనాలో కిలోగ్రాము నత్త శ్లేష్మాన్ని 2600 డాలర్లకు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే థాయ్‌లాండ్ లోని నత్తశ్లేష్మం నాణ్యతలో చాలా సమగ్రంగా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే నత్తలు కూరగాయలు, ధాన్యాలు, పుట్టగొడుగులు తదితర వాటిని తింటాయని, అందువల్ల మంచి నాణ్యత కలిగిన శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయని థాయ్‌లాండ్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ నత్తశ్లేష్మంతో కాలిన గాయాలను మాన్పడానికి ఔషధంగా వినియోగించడం పరిపాటి అయింది. అయితే ఈమేరకు అధ్యయనాలు మాత్రం ఇంతవరకు జరగలేదు. సైన్స్ విభాగం

Snail mucus and excretory residues are highly valued

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బంగారం కన్నా థాయ్‌లాండ్‌లో నత్త శ్లేష్మం విలువ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: