వికసించిన పువ్వే నువ్వా…!

  పువ్వులా నవ్వుతూ మొహం, సముద్రపు అలల్లాగా శిరోజాలు, చక్కని దేహకాంతి కావాలని కోరుకోని మహిళలు ఉండరు. నిపుణులు చెప్పే సూచనలు సలహాలు పాటిస్తే అందంగా కనిపించటం సాధ్యమే. ముందుగా చక్కని చర్మం ఉంటేనే మొహం మెరుపులు మెరుస్తుంది. స్నానం చేసిన వెంటనే తడి పొడి ఒంటి పైన మాయిశ్చరైజర్ అప్లయ్ చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. జిడ్డు చర్మం అయితే అనేక ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్లు ఉంటాయి. పొడి చర్మం గలవాళ్లు ఆయిల్ ఆధారిత నైట్ క్రీమ్స్ […] The post వికసించిన పువ్వే నువ్వా…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పువ్వులా నవ్వుతూ మొహం, సముద్రపు అలల్లాగా శిరోజాలు, చక్కని దేహకాంతి కావాలని కోరుకోని మహిళలు ఉండరు. నిపుణులు చెప్పే సూచనలు సలహాలు పాటిస్తే అందంగా కనిపించటం సాధ్యమే.
ముందుగా చక్కని చర్మం ఉంటేనే మొహం మెరుపులు మెరుస్తుంది. స్నానం చేసిన వెంటనే తడి పొడి ఒంటి పైన మాయిశ్చరైజర్ అప్లయ్ చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. జిడ్డు చర్మం అయితే అనేక ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్లు ఉంటాయి. పొడి చర్మం గలవాళ్లు ఆయిల్ ఆధారిత నైట్ క్రీమ్స్ వాడుకోవాలి.

పండ్లు, కూరగాయలు తింటే మొటిమలు ఎక్కువగా రావు. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు, గ్రీన్‌టీ మొటిమలు రానివ్వకుండా కాపాడతాయి. నీరు తాగితే శారీరక వ్యవస్థలో వ్యర్థాలు బయటకి పోతాయి. ప్రో బయోటిక్ పదార్థాలు తీసుకుంటే మరింత ఉపయోగం. మొహానికి, శిరోజాలకు రసాయన ఉత్పత్తులు వాడితే రాష్ వచ్చినా దురదలు వచ్చినా వెంటనే మానేయాలి. ముఖ్యంగా శిరోజాలకు రంగు విషయంలో శ్రద్ధగా ఉండాలి. కలర్ వేసిన జుట్టుకు ప్రతిసారి కండిషనింగ్ అవసరం. ప్రత్యేకమైన షాపులో కండిషనర్లు వాడాలి.

ఎంత చక్కని ఖరీదైన షాంపూ అయినా అందులో రసాయనాలు ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజూ తలస్నానం చేస్తే సహజ నూనెలు పోతాయి. జుట్టు ఆరోగ్యంగా శుభ్రంగా ఉండాలి అంటే వారానికి రెండుసార్లు తలస్నానం చాలు. కలర్ పోకుండా ఉండాలంటే శిరోజాలు ఆరోగ్యంగా మెయిన్‌టెయిన్ చేయాలంటే మైల్డ్ షాంపులు మాత్రమే వాడాలి. సల్ఫర్ లేని షాంపూ వాడితే జుట్టుకు వేసిన రంగు వెంటనే పోకుండా ఉంటుంది. మేకప్ బ్రష్ ప్రతివారం శుభ్రం చేసుకోవాలి. ముఖంగా ఫౌండేషన్, కన్సీలర్ బ్రష్‌లు తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. బ్రష్‌లు మురికి ఉంటే అవి చర్మానికి హాని చేస్తాయి. బ్రష్ క్లెన్సింగ్, లిక్విడ్ లేదా మైల్డ్ జంటిల్ సోప్ వాడుతూ క్లీన్ చేయాలి.

మొటిమలు అస్సలు చిదమకూడదు. మచ్చలు పడకుండా ఇన్ఫెక్షన్ ఇబ్బంది లేకుండా సర్జికల్ నీడిల్‌తో నొక్కి మృదువైన క్లెన్సర్ అప్లయ్ చేయాలి. మచ్చలు సమస్యలు రాకుండా ఉండాలంటే డెర్మాటాలజిస్ట్, కాస్మిటాలజిస్ట్‌ను సంప్రదించటం మంచిది.

వర్షాకాలపు మేకప్: వేసుకున్న మేకప్ కాసిని చినుకులు రాలినా చెదిరిపోతుంది. కాస్త జాగ్రత్తగా మేకప్ వేసుకుంటే ఇటు చెమటలు పోసినా, అటు వర్షంలో తడిసినా పాడైపోకుండా ఉంటుంది. ముందుగా క్లెన్సర్ వాడాలి. తరువాత ప్రైమర్ తప్పనిసరి వీటి వల్ల మేకప్ చెదిరిపోకుండా ఉంటుంది. తర్వాత ఫౌండేషన్ అప్లయ్ చేయాలి. దీన్ని వీలయినంత వరకు వేళ్లతో కాకుండా బ్రష్ అప్లయ్ చేయాలి.

అప్పుడే మొహమంతా పరుచుకుంటుంది. ఇక ఎండలో బయటకి పోవాలంటే సన్‌స్క్రీన్ అప్లయ్ చేయటం తప్పనిసరి. ఎండవేడికి మొహం కమిలితే కాసిని కొబ్బరినీళ్లు తాగి, మిగతా నీళ్లతో మొహం కడిగేసుకుంటే సరిపోతుంది. సన్‌ట్యాన్‌కు సరైన ప్రత్యమ్నాయం కొబ్బరినీళ్లే.

కళ్లు అలసట లేకుండా తాజాగా కనిపించాలంటే మేకప్‌కు ముందర ఒక బంగాళదుంప ముక్కను కానీ కీరాదోస ముక్కను కానీ కళ్లపై ఉంచుకుని, చల్లని నీళ్లతో తడిపిన పల్చని వస్త్రాన్ని మొహంపై కప్పేసి రిలాక్సయితే చాలు. అవసరం అయితే ఏ ఐస్ క్యూబ్ తో మఖం మసాజ్ చేస్తే మేకప్ ఎక్కువసేపు నిలిచి ఉంటుంది.

Tips for Women’s Beauty

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వికసించిన పువ్వే నువ్వా…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: