చెమ్మకు చెక్…

  వానాకాలం ఎంత శుభ్రంగా ఉన్నా తేమ చేరుతుంది. తేమలో ఇల్లు, ఆహార సామగ్రి సురక్షితంగ ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. వర్షాల సీజన్‌లో తేమ వల్ల ఫంగస్, బ్యాక్టీరియా మొదలైనవి పెరుగుతుంటాయి. దీంతో రోగాలు వ్యాపిస్తాయి. గోడలు వికారంగా దుర్గంధ భరితమవుతాయి. ప్లాస్టర్, పెయింట్ తొలగిపోతుంది. ఇంట్లో చెమ్మ ఎక్కడైనా ఏర్పడవచ్చు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఇల్లు కట్టేటప్పుడు తక్కువ క్వాలిటీ సామగ్రి వాడటం, డూప్లికేట్ తేమ నిరోధకాలు వాడటం, పైపుల […] The post చెమ్మకు చెక్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వానాకాలం ఎంత శుభ్రంగా ఉన్నా తేమ చేరుతుంది. తేమలో ఇల్లు, ఆహార సామగ్రి సురక్షితంగ ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.
వర్షాల సీజన్‌లో తేమ వల్ల ఫంగస్, బ్యాక్టీరియా మొదలైనవి పెరుగుతుంటాయి. దీంతో రోగాలు వ్యాపిస్తాయి. గోడలు వికారంగా దుర్గంధ భరితమవుతాయి. ప్లాస్టర్, పెయింట్ తొలగిపోతుంది. ఇంట్లో చెమ్మ ఎక్కడైనా ఏర్పడవచ్చు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఇల్లు కట్టేటప్పుడు తక్కువ క్వాలిటీ సామగ్రి వాడటం, డూప్లికేట్ తేమ నిరోధకాలు వాడటం, పైపుల లీకేజీ, వర్షం నీరు, స్లాబ్‌పై నీరు నిలవటం మొదలైనవి చెమ్మకు కారణం.

సరైన వెంటిలేషన్ లేకపోయినా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో రోజవారీ బట్టలు ఉతకటం, వంట చేయటం, ఇస్త్రీ వంటి పనులు కూడా చెమ్మను పెంచగలదు. చిన్న బాత్‌రూమ్ లేదా కిచెన్‌లో కిటికీ లేకపోవటం లేదా చిన్న గదుల్లో తడి దుస్తులు ఆరేయటం వల్ల కూడా వానాకాలంలో చెమ్మ ఏర్పడుతుంది.

నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి…
ఇంట్లో ఎక్కడా నీళ్లు నిల్వలేకుండా చూసుకోవాలి. నీళ్లు బయటికి వెళ్లిపోతూ ఉండాలి.
* కిటికీలు, తలుపుల ఫ్రేమ్ సరిగ్గా మూసి ఉండేలా చూసుకోండి.
* పై కప్పులో కాస్తంత లీకేజీ ఉన్నా వెంటనే మరమ్మతు చేయించడం మంచిది.
* ఇంట్లో వెంటిలేషన్‌కి సరైన ఏర్పాట్లు చేసుకోవాలి. బాత్‌రూమ్‌లో షవర్ లేదా కిచెన్ నుంచి ఆవిరి బయటికి వెళ్లకపోతే దాన్ని గదిగోడలు లాగేసుకుంటాయి. ఆ తర్వాత వాటిలో చెమ్మ ఏర్పడుతుంది. కాబట్టి దీన్నుంచి కాపాడుకోవడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడాలి.

* డొమెస్టిక్ డీహ్యూమిడి ఫైయర్ కూడా వాడుకోవచ్చు. ఇది బాత్‌రూమ్, గ్యారేజ్ బట్టలు ఆరేసే గదులు మొదలైన చోట్ల బాగుంటుంది. ఇవి చిన్న సైజులో ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కొన్ని డొమెస్టిక్ డీహ్యూమిడి ఫైయర్‌లలో బ్యాక్టీరియా, క్రిములను చంపేందుకు ఒక అదనపు యూవీ ల్యాంప్ కూడా ఉంటుంది. చాలా వాటిలో దుర్వాసనను పీల్చేందుకు కార్బన్ ఫిల్టర్ అమర్చుతారు.
* సీపేజ్ నుంచి కాపాడుకునేందుకు బయటి గోడలపై వాటర్ ఫ్రూఫ్ కోట్స్ వేయించటం మంచిది. దీంతో వాన, నీరు, తేమ ప్రభావం గోడలపై ఉండదు. పైకప్పు మీద కూడా వాటర్ ఫ్రూఫ్ రూఫ్ కోటింగ్ వేయిస్తే నీటి సీపేజ్ సమస్య ఉండదు.
* కొన్ని సార్లు గోడల దిగువ భాగాల్లో చెమ్మ గుర్తులు కనిపిస్తుంటాయి. దీనికి కారణం గ్రౌండ్ వాటర్. ఇది పైకి పోతుంది. దీన్నుంచి కాపాడుకోవడానికి డ్యాంప్ ఫ్రూఫ్ చేయించాలి. ద్వారా గ్రౌండ్ వాటర్ పైకి పాకి గోడలకు నష్టం కలిగించదు.
* కిచెన్ స్టోరేజీ సిస్టమ్‌ని మార్చుకోవాలి.

* పప్పులు, బియ్యం తదితర రోజువారీ వినియోగించే ఆహార సామగ్రిని ట్రాన్స్‌పరెంట్ లేదా గ్లాస్ కంటైనర్స్‌లోనే పెట్టుకోవాలి.
* ప్లాస్టిక్‌వి వాడుతున్నట్లయితే వాటి క్వాలిటీ బాగుండాలి.
* కాఫీ, టీ పొడి, చక్కెర, సుగంధ ద్రవ్యాలను తేమ నుంచి కాపాడేందుకు చిన్న గాజు జార్‌లను వాడండి. వీటిని అప్పుడప్పుడు కాసేపు ఎండలో కూడా పెట్టుకోవాలి.
* పచ్చళ్లు నిల్వ చేసేందుకు పెద్ద గ్లాస్ బౌల్ లేదా చైనా క్లే గిన్నెలు వాడాలి.
* స్టీల్ కంటైనర్స్ వాడితే వీటి పరిశుభ్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వీటిని పిండి మొదలైనవి నిల్వ చేసేందుకు వాడితే బాగుంటుంది.

Tips for protecting Home from Moisture

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చెమ్మకు చెక్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: