ఏదో కొత్తగా చేయాలనే ఉద్దేశ్యంతో అవి చేయట్లేదు…

  యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్‌కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండతో ఇంటర్వూ విశేషాలు… నాకు నచ్చిన విధంగా… చాలామంది నాతో ‘ఏ హీరో […] The post ఏదో కొత్తగా చేయాలనే ఉద్దేశ్యంతో అవి చేయట్లేదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్‌కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండతో ఇంటర్వూ విశేషాలు…

నాకు నచ్చిన విధంగా…
చాలామంది నాతో ‘ఏ హీరో చేయని విధంగా ప్రమోషన్స్ చేస్తున్నావు’ అని అంటున్నారు. నేను ఏదో కొత్తగా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రమోషన్స్ చేయట్లేదు. నాకు నచ్చిన విధంగా ప్రమోట్ చేద్దామని అలా చేస్తున్నాం. అలాగే ఈ సినిమా ఆల్బమ్ కూడా నాకు చాలా బాగా వచ్చింది. అందుకే బెంగుళూర్, చెన్నై, కొచ్చిన్‌లలో మ్యూజికల్ ఫెస్టివల్ నిర్వహించి ఈ సినిమాను ప్రమోట్ చేశాం.

అందుకే జనంలోకి…
నాకు బాగా కనెక్ట్ అయిన సినిమా ఇది. అలాగే ఈ సినిమా డైరెక్టర్ కూడా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. ఇక సినిమా అవుట్‌ఫుట్ కూడా చాలా బాగా వచ్చింది. అందుకే సినిమాను బాగా జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాము.

రెండు క్యారెక్టర్‌ల జర్నీ…
‘డియర్ కామ్రేడ్’ ఎమోషనల్ ఫిల్మ్. ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతినిచ్చే చిత్రమిది. సినిమాలో నా క్యారెక్టర్, రష్మిక క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. మా రెండు క్యారెక్టర్‌ల జర్నీనే ఈ సినిమా. నచ్చిన దాని గురించి పోరాడండి అని చెప్పే సినిమా ఇది.

యూత్‌కు నచ్చే…
సినిమాలో నేను స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తాను. అయితే రాజకీయాలకు సంబంధం లేకుండా సినిమా రూపుదిద్దుకుంది. యూత్‌కు నచ్చే సన్నివేశాలుంటాయి ఈ చిత్రంలో.

ఆద్యంతం వినోదాత్మకంగా…
స్టూడెంట్ లీడర్ బాబీ పాత్రలో నేను, లిల్లీ పాత్రలో రష్మిక మందన్న నటించింది. కమ్యూనిస్ట్ భావాలు కలిగిన స్టూడెంట్ లీడర్‌గా నేను కనిపిస్తాను. అయితే లిల్లీ క్రికెట్ ప్లేయర్. వారిద్దరూ ప్రేమలో పడటం, బ్రేకప్, ఒకరిపై మరొకరి ప్రభావం, భావోద్వేగ సన్నివేశాలతో ఈ చిత్రం ఆద్యంతం పూర్తి వినోదాత్మకంగా రూపుదిద్దుకుంది.

మొట్టమొదటి తెలుగు సినిమా…
తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకానున్న మొట్టమొదటి తెలుగు సినిమా ఇది. ‘బాహుబలి’ కూడా కన్నడలో రిలీజ్ కాలేదు. విడుదలకు ముందు టెన్షన్ అయితే ఉంది. కానీ సినిమా అవుట్ ఫుట్ చూశాక& సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది.

పెద్దగా ఆసక్తి లేదు…
ప్రస్తుతం తెలుగులో నటించడానికే నాకు సమయం సరిపోవట్లేదు. అయితే హిందీలో మంచి కథ వస్తే ఖచ్చితంగా బాలీవుడ్‌లో సినిమా చేస్తాను. కాకపోతే ముంబయ్‌కి వెళ్ళి అక్కడ ఉండి సినిమా చేయడమంటే పెద్దగా ఆసక్తి లేదు.

తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే ఓ కొత్త దర్శకుడితో కూడా ఓ సినిమా చేయబోతున్నాను. మరో రెండు కథలు విన్నాను బాగున్నాయి. వాటి గురించి త్వరలో తెలియజేస్తాను.

Interview with Vijay Deverakonda

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఏదో కొత్తగా చేయాలనే ఉద్దేశ్యంతో అవి చేయట్లేదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.