‘భారతీయుడు 2’లో రకుల్‌ ప్రీత్‌కు ఛాన్స్?

  హైదరాబాద్‌: తమిళ్ సూపర్ స్టార్, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు 2’. ఈ చిత్రాన్ని క్రియేటీవ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం కమల్‌ ‘బిగ్‌బాస్‌-3’తో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో మరో హీరోయిన్ గా […] The post ‘భారతీయుడు 2’లో రకుల్‌ ప్రీత్‌కు ఛాన్స్? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: తమిళ్ సూపర్ స్టార్, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు 2’. ఈ చిత్రాన్ని క్రియేటీవ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం కమల్‌ ‘బిగ్‌బాస్‌-3’తో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో మరో హీరోయిన్ గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను చిత్రయూనిట్ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై రకుల్‌ గానీ, చిత్రయూనిట్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ఈ చిత్రంలో రకుల్‌కు అవకాశం దక్కినట్లు కోలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నారు.

ఇక, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగులో నటించిన ‘మన్మథుడు 2’ సినిమా ఆగస్ట్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటు యంగ్ హీరో నితిన్ కు జోడీగా రకుల్ నటించనున్న చిత్రం ఇటీవల పూజాకార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే.

Rakul preet singh gets chance in Bharateeyudu-2!

The post ‘భారతీయుడు 2’లో రకుల్‌ ప్రీత్‌కు ఛాన్స్? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: