ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం కెసిఆర్‌ అభినందనలు

  హైదరాబాద్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయన్-2 ప్రయోగం సోమవారం మధ్యాహ్నం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలు సమిష్టి కృషితో గొప్ప ప్రతిభను చూపించారని సిఎం కెసిఆర్‌ కొనియాడారు. సోమవారం మధ్యాహ్నం 2.43 నిమిషాలకు  ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత 16 నిమిషాల 13 సెకన్ల పాటు జిఎస్‌ఎల్వి మార్క్‌-3 ఎం1 ప్రయాణించింది. అనంతరం […] The post ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం కెసిఆర్‌ అభినందనలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయన్-2 ప్రయోగం సోమవారం మధ్యాహ్నం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలు సమిష్టి కృషితో గొప్ప ప్రతిభను చూపించారని సిఎం కెసిఆర్‌ కొనియాడారు. సోమవారం మధ్యాహ్నం 2.43 నిమిషాలకు  ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత 16 నిమిషాల 13 సెకన్ల పాటు జిఎస్‌ఎల్వి మార్క్‌-3 ఎం1 ప్రయాణించింది. అనంతరం 39,059 కి.మీ. ఎత్తులో ఉన్న భూకక్ష్యలో చంద్రయాన్‌-2ను వాహననౌక విడిచిపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా జిఎస్ఎల్ వి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను తనతో పాటు తీసుకెళ్లిందని సైంటిస్టులు తెలిపారు. చంద్రుడిపైకి భారత్ చేసిన చారిత్రక ప్రయాణమిది అని, వచ్చే 45 రోజులు తమకు అత్యంత కీలకమని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ పేర్కొన్నారు.

CM KCR Congratulations to ISRO Scientists

The post ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం కెసిఆర్‌ అభినందనలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: