చంద్రయాన్-2 : నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్ వి

శ్రీహరికోట :  అగ్రదేశాలకు దీటుగా జాబిల్లిపై ఏముందో శోధించే క్రమంలో మరో భారత్ మరో అడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయన్-2 ప్రయోగం సోమవారం మధ్యాహ్నం జరిగింది. షార్ అంతరిక్ష కేంద్రంలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జిఎస్ఎల్ వి మార్చ్3ఎం1 వాహకనౌక నింగికి ఎగిసింది. సోమవారం  మధ్యాహ్నం 2.43 నిమిషాలకు ఈ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో యావత్ భారత ప్రజలు హర్షం […] The post చంద్రయాన్-2 : నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్ వి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

శ్రీహరికోట :  అగ్రదేశాలకు దీటుగా జాబిల్లిపై ఏముందో శోధించే క్రమంలో మరో భారత్ మరో అడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయన్-2 ప్రయోగం సోమవారం మధ్యాహ్నం జరిగింది. షార్ అంతరిక్ష కేంద్రంలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జిఎస్ఎల్ వి మార్చ్3ఎం1 వాహకనౌక నింగికి ఎగిసింది. సోమవారం  మధ్యాహ్నం 2.43 నిమిషాలకు ఈ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో యావత్ భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఈ ప్రయోగం ద్వారా జిఎస్ఎల్ వి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను తనతో పాటు తీసుకెళ్లింది. రాకెట్ బరువు 640 టన్నులని  సైంటిస్టులు తెలిపారు. 3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్- కాంపోజిట్ మాడ్యూల్ తో రాకెట్ పయనిస్తోంది. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్-2 మాడ్యూల్ విడిపోతుందని వారు చెప్పారు.  ఈ ప్రయోగానికి రూ. 978 కోట్లు వ్యయం చేశారు. ఇస్రో చేపట్టిన ఈ మహాత్తర ప్రయోగాన్ని యావత్ ప్రపంచం ఆసక్తికరంగా తిలకించింది.

Chandrayaan-2 : GSLV Experiment Success

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చంద్రయాన్-2 : నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్ వి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: