ఆమె లేని జీవితం వద్దు…ఫేస్‌బుక్ లైవ్‌లో యువకుడి ఆత్మహత్య

లక్నో: ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో ఓ యువకుడు ఫేస్‌బుక్ లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన యుపిలోని ఆగ్రాలో చోటుచేసుకుంది. రేభా గ్రామానికి చెందిన శ్యామ్ సికార్వార్ అనే యువకుడు, ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు గత రెండు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు తిరస్కరించడంతో యువకుడు బరించలేకపోయాడు. వీరి ప్రేమ వ్యవహారం బయటకు తెలిస్తే యువతికి సమస్యలు వస్తాయని త్వరగా […] The post ఆమె లేని జీవితం వద్దు… ఫేస్‌బుక్ లైవ్‌లో యువకుడి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో: ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో ఓ యువకుడు ఫేస్‌బుక్ లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన యుపిలోని ఆగ్రాలో చోటుచేసుకుంది. రేభా గ్రామానికి చెందిన శ్యామ్ సికార్వార్ అనే యువకుడు, ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు గత రెండు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు తిరస్కరించడంతో యువకుడు బరించలేకపోయాడు. వీరి ప్రేమ వ్యవహారం బయటకు తెలిస్తే యువతికి సమస్యలు వస్తాయని త్వరగా పెళ్లి చేయాలని యువతి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం చేయడంతో శ్యామ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. తాను దూరమవుతుందనే బాధ తన గుండెకు గాయం చేస్తోందని, టెన్షన్ తట్టుకోలేకపోతున్నానని, ప్రేమ విఫలం కావడంతో తన ఉద్యోగం కూడా పోయిందని, ప్రియురాలు లేని జీవితం వ్యర్థమని తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో రాశాడు. అనంతరం దేవాలయానికి వెళ్లి ఫేస్ బుక్ లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరు బాధ్యులు కాదని పేర్కొన్నాడు. తల్లిదండ్రులకు తీవ్ర దుఃఖాన్ని మిగులుస్తున్నానని క్షమించాలని ప్రాదేయపడ్డాడు. తాను చనిపోయిన తరువాత తన అవయవాలను దానం చేయాలని చివరి కోరకగా కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆమె లేని జీవితం వద్దు… ఫేస్‌బుక్ లైవ్‌లో యువకుడి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: