పిడుగుపాటుకు 32 మంది మృతి

లక్నో : యుపిలో భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల కారణంగా పిడుగుపడి 32 మంది చనిపోయారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాము కాటుతో ఇద్దరు చనిపోయారని అధికారులు తెలిపారు.   కాన్పూర్‌, ఫతేపూర్‌లో ఏడుగురు చొప్పున, ఝాన్సీలో ఐదుగురు, జలౌన్‌లో నలుగురు, హమీర్‌పూర్‌లో ముగ్గురు, ఘాజిపూర్‌లో ఇద్దరు, జౌన్‌పూర్‌, ప్రతాప్‌ఘర్‌, కాన్పూర్‌ దేహత్‌, చిత్రకోట్‌లో ఒకరి చొప్పున మృతి చెందారు. మృతుల కుటుంబాలకు యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ సానుభూతి […] The post పిడుగుపాటుకు 32 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో : యుపిలో భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల కారణంగా పిడుగుపడి 32 మంది చనిపోయారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాము కాటుతో ఇద్దరు చనిపోయారని అధికారులు తెలిపారు.   కాన్పూర్‌, ఫతేపూర్‌లో ఏడుగురు చొప్పున, ఝాన్సీలో ఐదుగురు, జలౌన్‌లో నలుగురు, హమీర్‌పూర్‌లో ముగ్గురు, ఘాజిపూర్‌లో ఇద్దరు, జౌన్‌పూర్‌, ప్రతాప్‌ఘర్‌, కాన్పూర్‌ దేహత్‌, చిత్రకోట్‌లో ఒకరి చొప్పున మృతి చెందారు. మృతుల కుటుంబాలకు యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

32 Dead With Thunder Bolt In UP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పిడుగుపాటుకు 32 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.