బిడ్డ కోసం ప్రాణాలు బలిచ్చిన తల్లి

బెంగళూరు :  ఏనుగు దాడికి గురైన తన నాలుగేళ్ల చిన్నారిని కాపాడి తాను ప్రాణాలను బలిపెట్టుకుందో తల్లి. ఈ ఘటన చామరాజనగర్‌ జిల్లా యల్లందూరు దొడ్డానెబెట్ట పరిధిలోని హలియూరు గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ గ్రామానికి చెందిన గౌరమ్మ (35) అనే మహిళ పొలం పనులు చూసుకుని బిడ్డతో పాటు వస్తున్న సమయంలో ఏనుగు దాడికి దిగింది. ఏనుగు ఘీంకరింపులతో భయపడిన గౌరమ్మ కొద్ది దూరం పరిగెత్తి కిందపడిపోయింది. ఈ క్రమంలో తన చంకలో ఉన్న తన […] The post బిడ్డ కోసం ప్రాణాలు బలిచ్చిన తల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బెంగళూరు :  ఏనుగు దాడికి గురైన తన నాలుగేళ్ల చిన్నారిని కాపాడి తాను ప్రాణాలను బలిపెట్టుకుందో తల్లి. ఈ ఘటన చామరాజనగర్‌ జిల్లా యల్లందూరు దొడ్డానెబెట్ట పరిధిలోని హలియూరు గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ గ్రామానికి చెందిన గౌరమ్మ (35) అనే మహిళ పొలం పనులు చూసుకుని బిడ్డతో పాటు వస్తున్న సమయంలో ఏనుగు దాడికి దిగింది. ఏనుగు ఘీంకరింపులతో భయపడిన గౌరమ్మ కొద్ది దూరం పరిగెత్తి కిందపడిపోయింది. ఈ క్రమంలో తన చంకలో ఉన్న తన నాలుగేళ్ల బిడ్డను పొదల్లోకి విసిరివేసింది. గౌరమ్మను ఏనుగు కాళ్లతో తొక్కి తొండంతో కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వచ్చి ఏనుగును అక్కడి నుంచి తరిమికొట్టారు. పొదల్లో బాలిక ఏడ్పులు వినిపించడంతో ఆ బాలికను రక్షించి తక్షణమే ఆస్పత్రికి తరలించారు. అయితే గ్రామ సమీపంలో ఏనుగుల సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Woman Dead In Elephant Attack At Karnataka

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బిడ్డ కోసం ప్రాణాలు బలిచ్చిన తల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: