సిఎం కెసిఆర్ సొంతూరు చింతమడకలో వేడుక వాతావరణం
నేడు స్వగ్రామాన్ని సందర్శించి ఊరి ప్రజలతో చిన్ననాటి మిత్రులతో మమేకం
కానున్న ముఖ్యమంత్రి
ఉదయం 10-11గం.ల సమయంలో సొంత ఊరికి
ప్రాథమిక పాఠశాల భవనం, డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం
మహాత్మ జ్యోతిరావుఫూలే పాఠశాల భవనానికి శంకుస్థాపన
మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి : సిఎం కెసిఆర్ తన సొంత గ్రామమైన సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో నేడు పర్యటించనున్నారు. కెసిఆర్ ఉదయం 10 నుండి 11 గంట ల మధ్య సమయంలో గ్రామానికి చేరుకొని సాయ ంత్రం వరకు చిన్ననాటి స్నేహితులతో పాటు గ్రా మస్తులతో గడపనున్నారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనంతో పాటు, నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్లను కెసిఆర్ ప్రారంభించి, గ్రామ శివారులో రూ. 30 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రామాలయ ం, శివాలయం లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పెద్దమ్మ దేవాలయ సమీపంలోని ఐకెపీ గోదాం సిసి ఫ్లాట్‌ఫాం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో గ్రామస్తులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, అక్కడే సహపంక్తి భోజనాలు చేస్తారు. ఇప్పటికే అధికారులు ప్రతి ఇంటికి సమగ్ర సర్వే ను నిర్వహించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించారు. సర్వే పూర్తయి న ప్రతి ఇంటికి 10 లక్షల విలువైన సంక్షేమ ఫలాలు అందనున్నాయి.
సభకు హాజరుకానున్న సుమారు 3200 మంది గ్రామస్తులకు గులాబీ రంగుతో కూడిన గుర్తింపు కార్డులు, అధికారులకు తెలుపు, మీడియా వారికి ఆకుపచ్చ గుర్తిం పుకార్డులను జారీ చేశారు. గుర్తింపుకార్డులు ఉన్నవారికే సభా ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. కెసిఆర్ రానున్న నేపథ్యంలో గత పదిరోజుల నుండే మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమీషనర్ జోయల్ డేవిస్ గ్రామంలో పలుమార్లు పర్యటించి, అక్కడ జరుగుతున్న ఏ ర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కెసిఆర్ రాకతో చింతమడక గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే గ్రామంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. వర్షాకాలంను దృష్టిలో ఉంచుకొని ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లతో సభాస్థలిని ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
వెయ్యిమంది పోలీసులతో సిఎంకు బందోబస్తు
ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం చింతమడకలో పర్యటన నేపథ్యంలో ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, ఎసిపిలు/డిఎల్పీలు ఎనిమిది మంది. 32 మంది సీఐలు, 74 మంది ఎస్ఐలతో మొత్తంగా 1050 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సిద్ధిపేట నుంచి చింతమడక వరకు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు సిద్ధిపేట కమిషనర్ జోయల్ డేవిస్ మీడియాకు తెలిపారు. బందోబస్తును మొత్తం 15 సెక్టార్లుగా విభజించడం జరిగిందన్నారు. చింతమడక గ్రామస్తులకు గులాబీ రంగు, అధికార యంత్రాంగానికి తెలుపు రంగు, మీడియాకు గ్రీన్ రంగు పాసులు ఇస్తున్నట్లు చెప్పారు. పాసులు ఉన్నవారిని మాత్రమే గ్రామంలోకి అనుమతిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులను అనుమతించబోమని స్పష్టం చేశారు.
Cm KCR to visit Chintamadaka today
Related Images:
[See image gallery at manatelangana.news]The post బిడ్డ కోసం ఎదురుచూపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.