గంజాయికి బా’నిషా’స…!

  ఏకంగా పాఠశాలలోకి గంజాయి ప్యాకెట్లు నాంపల్లిలో మత్తులో కత్తులతో తలనరికిన వైనం సిగరేట్, ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటున్న యువకులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాకిన గంజాయి భూతం ఇంత జరుగుతున్నా అధికారుల చర్యలు శూన్యం! ‘నీ యవ్వన తేజంలో ఈ దేశం ఫలించాలి… నవత రమా, యువతరమా, తరంగమై లేచిరమ్మ’ అని ఓ కవి అన్నారు. అలాంటి యువత మత్తు బానిసై కుంగిపోతోంది. నిస్తేజంగా మత్తేక్కిస్తోంది. తనను తానే మైమరిచిపోయి నిషాలోకి జారిపోతోంది. విద్యార్థులు […] The post గంజాయికి బా’నిషా’స…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఏకంగా పాఠశాలలోకి గంజాయి ప్యాకెట్లు
నాంపల్లిలో మత్తులో కత్తులతో తలనరికిన వైనం
సిగరేట్, ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటున్న యువకులు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాకిన గంజాయి భూతం
ఇంత జరుగుతున్నా అధికారుల చర్యలు శూన్యం!

‘నీ యవ్వన తేజంలో ఈ దేశం ఫలించాలి… నవత రమా, యువతరమా, తరంగమై లేచిరమ్మ’ అని ఓ కవి అన్నారు. అలాంటి యువత మత్తు బానిసై కుంగిపోతోంది. నిస్తేజంగా మత్తేక్కిస్తోంది. తనను తానే మైమరిచిపోయి నిషాలోకి జారిపోతోంది. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలై బంగారు జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. సరదాగా ప్రారంభించి మెల్లగా దానికి లోబడిపోతున్నారు. మంచి చెడూ మరిచి మత్తు పదార్థాల కోసం చేయ రాని పనులు చేస్తున్నారు.

ఇంట్లో కన్నవాళ్లు గాని, పాఠశాల, కళాశాలలో విద్యాబుద్ధులు నేర్పుతున్న గురువులు కానీ వీరిని గమనించలేక పోతున్నారు. వీటిపై అవగాహన కల్పించి సన్మార్గంలో నడిపించా ల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడం ఒ కింత ఆందోళన కలిగించే అంశమే. ఫలితంగా వి కసించే వయస్సు, జీవితం రెండూ చేజారిపోతున్నా యి. హైద్రాబాద్ వంటి మహానగరాల్లో కలకలం రే పుతున్న గంజాయి మాఫియా ఇప్పుడు ఉమ్మడి న ల్గొండ జిల్లాలో కలంకలం రేపుతోంది. ఈ నేపథ్యం లో మన తెలంగాణ అందస్తోన్న ప్రత్యేక కథనం.

యదాద్రిభువనగిరి : నల్గొండ, సూర్యపేట, యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రాలలోని పలు మండలాల్లో ఎగబాకింది. ప్రధాన పట్టణాలలోని విద్యా సంస్థలను టార్టెట్ చేసుకొని డ్రగ్స్ మాఫియా ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. పదో తరగతి పిల్ల వాళ్లు కూడా ఈ డ్రగ్స్ తీసుకుంటుండటంతో ప్రజలు, తల్లిదండ్రులు భయకంపితులవుతున్నారు. నగరంలో విచ్ఛలవిడిగా మాధకద్రవ్యాల వినియోగం నాంపల్లి, బొమ్మలరామారం మండలంలో యువత విచ్ఛలవిడిగా మా దకద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాన కూడళ్లు, నిర్మానుష్య ప్రదేశాల్లో యువ త జోరుగా గంజాయి వంటి మత్తు పదార్థాలను పీల్చేస్తున్నారని వినికిడి.

అందులో భాగంగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని ఎస్‌సి కాలనీలో శనివారం సా యంత్రం కొబ్బరి కత్తితో నిందితులు ఇర్ఫాన్, గౌస్ ఇద్ద రు సద్దాం అనే యువకుడి తల నరికి అదే తలతో పా టు నాంపల్లి పోలీస్టేషన్‌కు వెళ్లి లొంగిపొయిన సంఘటన పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో గంజాయి మత్తుకు యువత, విద్యార్థులు బానిసలుగా మారుతున్నారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలో గంజాయి రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గంజాయికి బానిస అవుతున్నట్లు సమాచారం. శ నివారం విద్యార్థుల ప్రవర్తనలో మార్పు రావడాన్ని గ మనించిన వ్యాయామ ఉపాధ్యాయుడు 9, 10వ తరగ తి విద్యార్థుల స్కూల్ బ్యాగులను తనిఖీ చేయగా ఓ వి ద్యార్థి బ్యాగు నుంచి 100 గ్రాముల గంజాయి ప్యాకె ట్ లభించింది.

వెంటనే ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థులకు కౌన్సిలిం గ్ ఇవడంతో పాటు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అంది ంచారు. గంజాయి ప్యాకెట్‌పై విద్యార్థులను ఆరా తీ యగా దుకాణాలలో గంజాయి దొరుకుతుందని, అక్క డి నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. 1 ప్యాకెట్ ధర రూ.200 ఉంటుందని, దానిని ఐదు నుంచి ఆరుగురు కలిపి తాగుతున్నట్లు విచారణలో తెలిపారు. ఇది లా ఉంటే వలిగొండ మండలంలోని కొన్ని గ్రామాలలో గంజాయి మొక్కలనే పెంచుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రాధానంగా భువనగిరి పటణంతో పా టు బొమ్మలరామారం, వలిగొండ, తుర్కపల్లి, యాదగిరిగుట్ట ప్రాంతల్లో గంజాయి వాసన పాకినట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్న పోలీసు శాఖ మాత్రం ని మ్మకునిరేతినట్లు వ్యవహరిస్తున్న తీరుపట్ల ప్రజలు ప లు రకలుగా మాట్లాడుకుంటున్నారు.

చీకటి పడితే చాలు.. పాఠశాల ముగియగానే ఇంటికి వచ్చిన తర్వాత రోజూ సాయత్రమైందంటే యువకులు గుంపులగా గ్రామాల్లోని రహస్య ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ద్విచక్ర వాహనాల్లో వచ్చిన వారు దుకాణాల్లో లభించే సిగరేట్‌లోని పొగాకును తీసేసి అందు లో గంజాయి నింపుకుని తాగుతున్నారు. రోజూ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వారంతా గుంపులుగా చే రి గంజాయి పీలుస్తున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతుం ది. యాదాద్రిభువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం తుర్కపల్లి మండలంలోని పలు గిరిజన తండాలతో పా టు పలు గ్రామాలోని యువకులు జిల్లాలోని ఇతర మ ండల గ్రామీణ తదితర ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకున్నారు. గంజాయి విక్రయదారుల 1525 ఏళ్ల వ యసున్న యువకులను లక్షంగా పెట్టుకుని సరఫరా చేస్తున్నారనే విమర్శలు వనిపిస్తున్నాయి. ఇప్పటికే కొం త మంది యువకులు దీనికి పూర్తిగా బానిసలయ్యారు. వారు రోజంతా మత్తులో ఉండటం, ఇంట్లో చిరాకుగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో కనిపిస్తున్నారు.

అధికారుల చర్యలేవి..? డ్రగ్స్ మాఫియా జోరుగా సా గుతున్నా అధికారుల చర్యలు తీసుకోవడంలో మాత్రం శూన్యం అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ డ్రగ్స్‌పై నిషేశం విధించి పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సి ఉండగా అధికారులు మాత్రం వీటిని నియంత్రించడం లో పూర్తిగా విఫలమయ్యారన్న వార్తలు వినవస్తున్నా యి. రాత్రి పూట ఆకతాయిల ఆగడాలకు అంతు లే కుండా పోతున్నాయి. నిత్యం ఏదో గొడవలు, తోపులాటలు జరుగుతూనే ఉన్నాయి. డ్రగ్స్ నియంత్రణలో ప్ర భుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు అధికారుల నిఘా పెంచితే కొంత మేర యువత పక్కదారి పట్టకుండా ఉంటారని పలువురు వాపోతున్నారు.

Drugs Mafia is spreading to Educational Institutions

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గంజాయికి బా’నిషా’స…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: