25న ట్రైలర్…

  నాగార్జున అక్కినేని, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఇటీవల విడుదలైన అవంతిక పాత్రలోని రకుల్‌ప్రీత్ సింగ్ క్యారెక్టర్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈనెల 25న ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాతలు […] The post 25న ట్రైలర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నాగార్జున అక్కినేని, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇక ఇటీవల విడుదలైన అవంతిక పాత్రలోని రకుల్‌ప్రీత్ సింగ్ క్యారెక్టర్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈనెల 25న ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఆగస్టు 9న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. లక్ష్మీ, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః ఎం.సుకుమార్, మ్యూజిక్‌ః చైతన్య భరద్వాజ్, ఎడిటర్స్‌ః ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి, డైలాగ్స్‌ః కిట్టు విస్సా ప్రగడ, రాహుల్ రవీంద్రన్.

Manmadhudu 2 Movie Trailer Release on July 25

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 25న ట్రైలర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: