ప్రియమణితో సినిమా చేయడం దేవుడిచ్చిన వరం…

  ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కమల్ బోరా, ఏఎన్ భాషా, రామసీత నిర్మిస్తున్నారు. ‘మహానటి’ ఫేమ్ సాయి తేజస్విని, ప్రభాకర్, అజయ్ రత్న, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కె.రాఘవేంద్ర రావు మాట్లాడుతూ “ప్రియమణి సతి సావిత్రిలాగా అటు మోడ్రన్, ఇటు ట్రెడిషనల్ ఏ పాత్రకైనా […] The post ప్రియమణితో సినిమా చేయడం దేవుడిచ్చిన వరం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కమల్ బోరా, ఏఎన్ భాషా, రామసీత నిర్మిస్తున్నారు. ‘మహానటి’ ఫేమ్ సాయి తేజస్విని, ప్రభాకర్, అజయ్ రత్న, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కె.రాఘవేంద్ర రావు మాట్లాడుతూ “ప్రియమణి సతి సావిత్రిలాగా అటు మోడ్రన్, ఇటు ట్రెడిషనల్ ఏ పాత్రకైనా సరిపోతుంది.

ప్రస్తుతం ఆమె యాక్షన్ చిత్రం చేయడం చాలా బావుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. ప్రియమణి మాట్లాడుతూ “నేను ఈ సినిమాలో ఇంత బాగా కనిపించడానికి కారణం ప్రకాష్. నేను చెన్నైలో ఉండగా ఓంప్రకాష్, భాషా వచ్చి ఈ కథ చెప్పారు. కథ నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పాను. ఈ సినిమాలో నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. చిన్నారి సాయి తన పాత్రలో చాలా బాగా నటించింది. టీజర్, ట్రైలర్ చాలా బావున్నాయి”అని చెప్పారు. దర్శకుడు ప్రకాష్ మాట్లాడుతూ “భాషా, కమల్ బోరాలకు కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది.

ప్రియమణి ఈ చిత్రంలో నటించడంతో ఎంతో ఆనందంగా ఉంది. నా రెండో సినిమాను జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రియమణితో చేయడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. సిరివెన్నెల పాత్ర ఎవరు చేస్తారా అని ఆలోచిస్తే చిన్నారి సాయి తేజస్విని గుర్తుకువచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.రాజేంద్రప్రసాద్, ఎం.ఎం.కీరవాణి, వైవిఎస్ చౌదరి, ఆర్‌పి పట్నాయక్, సురేష్ కొండేటి, భాషా, కమల్ బోరా తదితరులు పాల్గొన్నారు.

Making Film with Priyamani is gift from God

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రియమణితో సినిమా చేయడం దేవుడిచ్చిన వరం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.