సిపిఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

డిల్లీ: సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు డి.రాజా (70) ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో ఆ పదవి నుంచి సురవరం సుధాకర్ రెడ్డి తప్పుకోవడంతో రాజాను ఎన్నుకున్నారు. 2012 నుంచి సుధాకర్ రెడ్డి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో ఆయన తప్పుకున్నారు. సుధీర్ఘకాలం సిపిఐ జాతీయ నేతగా ఉన్న రాజాను సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ సిపిఐ జాతీయ  మండలి నిర్ణయం తీసుకుంది.  సిపిఐ జాతీయ […] The post సిపిఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

డిల్లీ: సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు డి.రాజా (70) ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో ఆ పదవి నుంచి సురవరం సుధాకర్ రెడ్డి తప్పుకోవడంతో రాజాను ఎన్నుకున్నారు. 2012 నుంచి సుధాకర్ రెడ్డి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో ఆయన తప్పుకున్నారు. సుధీర్ఘకాలం సిపిఐ జాతీయ నేతగా ఉన్న రాజాను సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ సిపిఐ జాతీయ  మండలి నిర్ణయం తీసుకుంది.  సిపిఐ జాతీయ మండలి సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో నాయకత్వ మార్పుపై చర్చించారు. ఈ క్రమంలో రాజాను సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. దీంతో ఆయన్ను ఎన్నుకున్నారు. ప్రస్తుతం రాజా తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

MP D.Raja Elect As CPI General Secretary

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సిపిఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: