అమెరికాలో హిందూ పూజారిపై దాడి

అమెరికా :  గ్రీన్‌ ఓక్స్‌ ప్రాంతంలోని శివ శక్తి పీఠంలో పూజారిగా పని చేస్తున్న హరీశ్ చందర్ పూరిపై ఆదివారం  దాడి జరిగింది. పీఠం సమీపంలోనే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. హరీష్‌ చందర్‌ నడుచుకుంటూ వెళుతుండగా, వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆయనపై దాడి చేశాడు.  ఈ ఘటనలో హరీశ్ కు గాయాలయ్యాయి. తక్షణమే  ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. దాడికి పాల్పడిన వ్యక్తి సెర్జియ గువెయ (52)గా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. […] The post అమెరికాలో హిందూ పూజారిపై దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమెరికా :  గ్రీన్‌ ఓక్స్‌ ప్రాంతంలోని శివ శక్తి పీఠంలో పూజారిగా పని చేస్తున్న హరీశ్ చందర్ పూరిపై ఆదివారం  దాడి జరిగింది. పీఠం సమీపంలోనే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. హరీష్‌ చందర్‌ నడుచుకుంటూ వెళుతుండగా, వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆయనపై దాడి చేశాడు.  ఈ ఘటనలో హరీశ్ కు గాయాలయ్యాయి. తక్షణమే  ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. దాడికి పాల్పడిన వ్యక్తి సెర్జియ గువెయ (52)గా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది విద్వేష దాడని, తమ గురువును టార్గెట్ గా  చేసుకుని ఈ దాడి  జరిగిందని హరీశ్ చందర్ శిష్యులు తెలిపారు. ఈ దాడికి పాల్పడే ముందు సెర్జియ, ఇది తమ ప్రాంతమని నినాదాలు చేసినట్టు వారు వెల్లడించారు.  గాయాల నుంచి తాను నిదానంగా కోలుకుంటున్నానని, తనపై దాడికి దిగిన వ్యక్తి కోసం కూడా ప్రార్థనలు చేస్తానని హరీశ్ చందర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Attack On Hindu Priest in America

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమెరికాలో హిందూ పూజారిపై దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: