మున్సిపోల్స్‌పై రేపటికి స్పష్టత

n ఎన్నికలు ఎప్పుడొచ్చినా వార్డులన్నీ మనమే గెలవాలి n టికెట్ ఎవరికిచ్చినా అందరూ కలిసి పనిచేయాలి n పోటీ చేసే వారు పురపాలక చట్టాన్ని పూర్తిగా చదవాలి n ఇతరులకు సుద్దులు చెప్పి మీరు అవినీతికి పాల్పడవద్దు టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : పురపాలక సంఘం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయం సోమవారం తెలుస్తుందని టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ పేర్కొన్నారు. శనివారం సిరిసిల్లలో టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. “ఎప్పుడు […] The post మున్సిపోల్స్‌పై రేపటికి స్పష్టత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

n ఎన్నికలు ఎప్పుడొచ్చినా వార్డులన్నీ మనమే గెలవాలి
n టికెట్ ఎవరికిచ్చినా అందరూ కలిసి పనిచేయాలి
n పోటీ చేసే వారు పురపాలక చట్టాన్ని పూర్తిగా చదవాలి
n ఇతరులకు సుద్దులు చెప్పి మీరు అవినీతికి పాల్పడవద్దు
టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : పురపాలక సంఘం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయం సోమవారం తెలుస్తుందని టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ పేర్కొన్నారు. శనివారం సిరిసిల్లలో టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. “ఎప్పుడు ఎన్నికలు జరిగినా వార్డులన్నీ మనం గెలవాల్సిందేనని కార్యకర్తలకు, నాయకులకు ఆయన సూచించారు. రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని ఆయన పేర్కొన్నారు. వార్డులవారీగా మ్యానిఫెస్టో తయారు చేసుకోవాలన్నారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందు ఉందన్నారు. ఎన్నికల్లో పోటీకి ఎవరెవరూ సమర్థులన్న సమాచారం తన వద్ద ఉందని, టికెట్ ఎవరికిచ్చినా అందరూ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. టికెట్ తమకే ఇవ్వాలని ఎవరూ భయపెట్టినా భయపడే ప్రసక్తి లేదన్నారు. నాలుగు రోజుల్లో అన్ని వార్డుల్లో బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
పురపాలక చట్టంలో మార్పు వచ్చిందని, ఎన్నికల్లో పోటీ చేసేవారు ముందు పురపాలక చట్టం పూర్తిగా చదవాలన్నారు. ఇతరులకు సుద్దులు చెప్పి మనం అవినీతికి పాల్పడితే బాగుండదని ఆయన సూచించారు.
అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు
ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తనకు 89 వేల మెజార్టీని ప్రజలు ఇచ్చారని, అదే గుర్తు పార్టీ మీకు టికెట్లు ఇస్తుందని, ఎందుకు ఓట్లు పడవో మీరే ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థుల గెలుపునకు ఆ బృందాలు పనిచేస్తాయని, పెత్తనం చేయడానికి కాదని ఆయన పేర్కొన్నారు. సిరిసిల్లలో 117 పోలింగ్ బూతులు ఉన్నాయని వాటన్నింటికి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు కావాలసిన ప్రచార సామగ్రిని అందించే బాధ్యత తమదేనని ఆయన పేర్కొన్నారు. కేవలం అభివృద్ధి పనులు చేసినంత మాత్రాన గెలుస్తామనుకోవడం తప్పన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదన్న సామెతను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. చైర్మన్ ఎవరన్న విషయం ఎన్నికల తరువాత ఆలోచిస్తామని, ఇప్పుడు తొందర లేదని ఆయన పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్, బిజెపి పార్టీలకు లేదని అన్నీ వార్డుల్లో అభ్యర్థులు దొరకని ఆయన ఘంటాపథంగా పేర్కొన్నారు. టికెట్లు, పదవులు రాకపోయినంత మాత్రా న ఎవరూ బాధపడవద్దని మా రామన్న ఉన్నాడని ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రం 17 శాతం అభివృద్ధితో ముందుకు దూసుకెళుతుందన్నారు.

KTR Speech At Siricilla Public Meeting

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మున్సిపోల్స్‌పై రేపటికి స్పష్టత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: