మార్చినాటికి కొల్లూరు మెగా కాలనీ: చిత్రారామచంద్రన్

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూ రో: రామచంద్రపురం మండలం కొల్లూర్‌లో రూ.1354.59 కోట్ల వ్యయంతో చేపట్టిన 15,660 డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం మెగా ప్రాజెక్టు మార్చి నెలలోగా మాసాంతంలోగా పూర్తిచేసి లబ్ధ్దిదారులకు అందించాలని పభుత్వం నిర్ణయించింది. కొల్లూరులోని 124 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాక్‌ల్లో అత్యాధునిక షీర్వాల్ టెక్నాలజీ జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఈమెగా డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామచంద్రన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇళ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించడం, […] The post మార్చినాటికి కొల్లూరు మెగా కాలనీ: చిత్రారామచంద్రన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూ రో: రామచంద్రపురం మండలం కొల్లూర్‌లో రూ.1354.59 కోట్ల వ్యయంతో చేపట్టిన 15,660 డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం మెగా ప్రాజెక్టు మార్చి నెలలోగా మాసాంతంలోగా పూర్తిచేసి లబ్ధ్దిదారులకు అందించాలని పభుత్వం నిర్ణయించింది. కొల్లూరులోని 124 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాక్‌ల్లో అత్యాధునిక షీర్వాల్ టెక్నాలజీ జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఈమెగా డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామచంద్రన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇళ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించడం, ఇళ్ల నిర్మాణాలతో అధికారులు మంచి టీం వర్క్‌తో పనిచేయడం వల్ల ప్రత్యేక కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారు. మెగా హౌసింగ్ కాలనీ నిర్మాణాన్ని 2020 మార్చి మాసంలో పూర్తి అవుతాయని ప్రకటించారు. కేవలం 10 నెలల కితం ప్రారంభించిన ఈ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగతున్నాయని, ముఖ్యంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరగడం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కాలనీ దేశంలోనే మోడల్ కాలనీగా రూపొందిస్తున్నామని అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పిస్తున్నట్లు తెలిపారు. హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి గడువును నిర్దేశించుకొని, అందుకు అనుగుణంగా పనులు కొనసాగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో బలహీన వర్గాలకు ఉచితంగా ఒకే దగ్గర నిర్మించిన దాఖాలాలు లేవని, ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును మోడల్ సిటీగా రూపొందించినున్నట్లు వెల్లడించారు. సిఎం కేసిఆర్ దార్శనికతనకు ప్రతిరూపమైన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ఉత్తమ ప్రమాణాలతో కూడిన బిల్డింగ్ మెటీరియల్‌ను ఉపయోగించడంతో పాటు థర్డీ పార్టీ ద్వారా నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేయిస్తున్నామని చెప్పారు.ఈకార్యక్రమంలో చీప్ ఇంజనీర్ సురేష్, గృహ నిర్మాణ అధికారులు పాల్గొన్నారు.

Construction of 15660 double bedroom houses in Kollur

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మార్చినాటికి కొల్లూరు మెగా కాలనీ: చిత్రారామచంద్రన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: