విదర్భలో మిషన్‌భగీరథ -మహారాష్ట్ర ఉన్నతాధికారి

మన తెలంగాణ/హైదరాబాద్: మిషన్ భగీరథతో తాగునీటి కొరతను అధిగమించి దేశానికి తెలంగాణ స్ఫూర్తిగా నిలిచిందని మహారాష్ట్ర తాగునీటి, పారిశుద్ధ్య విభాగం అడిషనల్ సెక్రెటరీ శ్యామ్ లాల్ అన్నారు. తక్కువ సమయంలో అత్యంత నాణ్యతతో భగీరథ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. వికారాబాద్ జిల్లా రాఘవాపూర్ దగ్గర నిర్మించిన 135 ఎంఎల్‌డి నీటి శుద్ది కేంద్రాన్ని శ్యామ్ లాల్ నేతృత్వంలో వచ్చిన మహారాష్ట్ర తాగునీటి విభాగం ఇంజనీర్లు సందర్శించారు. ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోని విభాగాలను పరిశీలించారు. చిన్న లీకేజీ […] The post విదర్భలో మిషన్‌భగీరథ -మహారాష్ట్ర ఉన్నతాధికారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: మిషన్ భగీరథతో తాగునీటి కొరతను అధిగమించి దేశానికి తెలంగాణ స్ఫూర్తిగా నిలిచిందని మహారాష్ట్ర తాగునీటి, పారిశుద్ధ్య విభాగం అడిషనల్ సెక్రెటరీ శ్యామ్ లాల్ అన్నారు. తక్కువ సమయంలో అత్యంత నాణ్యతతో భగీరథ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. వికారాబాద్ జిల్లా రాఘవాపూర్ దగ్గర నిర్మించిన 135 ఎంఎల్‌డి నీటి శుద్ది కేంద్రాన్ని శ్యామ్ లాల్ నేతృత్వంలో వచ్చిన మహారాష్ట్ర తాగునీటి విభాగం ఇంజనీర్లు సందర్శించారు. ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోని విభాగాలను పరిశీలించారు. చిన్న లీకేజీ కూడా లేకుండా ప్లాంట్‌ను మంచిగా నిర్వహిస్తున్నారని మహారాష్ట్ర బృందం ప్రశంసించింది. పనులు చేసిన తీరును తెలుసుకున్నారు. 365 రోజులు తాగునీరు అందుబాటులో ఉండే విధంగా ప్రాజెక్ట్ ను డిసైన్ చేసిన తీరును తెలుసుకున్నారు. ఆ తరువాత పరిగి మండలం సొందా పూర్ తండాలో మహారాష్ట్ర బృందం పర్యటించింది. ఇంటింటికి నల్లా నీళ్లు సరఫరా అవుతున్న తీరును గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత మాట్లాడిన శ్యామ్ లాల్, విదర్భ తాగునీటి సమస్యను తీర్చేందుకు తమ ప్రభుత్వం మిషన్ భగీరథ లాంటి పథకాన్ని త్వరలోనే మొదలు పెడుతుందన్నారు. ఇప్పటికే ఒకసారి తమ బృందం భగీరతను పరిశీలించి వెళ్లిందన్నారు. మిషన్ భగీరథ డిజైన్, పనులు జరిగిన తీరులోనే తమ ప్రాజెక్ట్ కూడా ఉంటుందన్నారు. ఈ పర్యటనలో భగీరథ చీఫ్ ఇంజినీర్లు విజయ్ ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, ఇఇ నరేందర్, కన్సల్టెంట్ జగన్‌తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.

Maharashtra Drinking Water Department Engineers visits Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విదర్భలో మిషన్‌భగీరథ -మహారాష్ట్ర ఉన్నతాధికారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.