సుందిళ్లకు కాళేశ్వరం జలాలు

మన తెలంగాణ/మంథని రూరల్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేట పంపుహౌజ్ మొదటి మోటారు వెట్న్ విజయవంతమైంది. శుక్రవారం సాయంత్రం అన్నా రం పంపుహౌజ్‌లోని ఎనిమిది మోటార్లలో మొదటి మోటారుకు నీటిపారుదల శాఖ సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక పూజలు చేసి డ్రై రన్ చేశారు. సుమారు 24 గంటల వ్యవధిలో ఇంజనీరింగ్ అధికారులు సాంకేతిక లోపాలను సవరించి శనివారం సాయంత్రం వెట్న్ చేసి సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోశారు. […] The post సుందిళ్లకు కాళేశ్వరం జలాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/మంథని రూరల్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేట పంపుహౌజ్ మొదటి మోటారు వెట్న్ విజయవంతమైంది. శుక్రవారం సాయంత్రం అన్నా రం పంపుహౌజ్‌లోని ఎనిమిది మోటార్లలో మొదటి మోటారుకు నీటిపారుదల శాఖ సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక పూజలు చేసి డ్రై రన్ చేశారు. సుమారు 24 గంటల వ్యవధిలో ఇంజనీరింగ్ అధికారులు సాంకేతిక లోపాలను సవరించి శనివారం సాయంత్రం వెట్న్ చేసి సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోశారు. సుందిళ్ల బ్యారేజీకి నీటిని తరలించడానికి అన్నారంపంపుహౌజ్ గ్రావిటీ కెనాల్ వద్ద గల హెడ్‌రెగ్యులేటర్ మూడు గేట్లను ఎత్తి మొదటి పంపును ఆన్ చేశారు. మొదటి పంపును 90 శాతం ఆర్పీఎంతో నడిపామని, 100 శాతం ఆర్‌పిఎంతో నడిపిన తరువాత నిరంతరం పంపు ను నడిపిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఒక పంపు రోజుకు మూడు వేల క్యూసెక్‌ల నీటిని ఎత్తిపోస్తుందన్నారు. నీటిని ఎత్తిపోసేందుకు పంపుహౌజ్‌లో నాలుగు మోటార్లు సిద్ధ్దంగా ఉన్నాయి. క్రమ క్రమంగా రోజుకు ఒక పంపుతో నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు తీసుకుంటామని పంపుహౌజ్ అధికారులు పేర్కొన్నారు.

Kaleshwaram Water Release To Sundilla Project

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సుందిళ్లకు కాళేశ్వరం జలాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: