కౌలు రైతుల మేలుకు చట్టం ?

కౌలు రైతుల రక్షణ చట్టంపై ప్రభుత్వం న్యాయశాఖతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే రైతు పాసు పుస్తకాల నుంచి కౌలు కాలమ్‌ను ప్ర భుత్వం తొలగించింది. అందులో భా గంగా కౌలు రైతులకు న్యాయం చే యాలన్న ఆలోచనలో ఉన్న ప్రభు త్వ ం న్యాయశాఖ అధికారులతో దీనిపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొత్త చట్టాలతో అవినీతి రహిత పాలనను ప్రజలకు అందించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించిన నేపథ్యంలో, తాజాగా కౌలు రైతులకు ఏ విధంగా సాయం చేయాలన్న దానిపై […] The post కౌలు రైతుల మేలుకు చట్టం ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కౌలు రైతుల రక్షణ చట్టంపై ప్రభుత్వం న్యాయశాఖతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే రైతు పాసు పుస్తకాల నుంచి కౌలు కాలమ్‌ను ప్ర భుత్వం తొలగించింది. అందులో భా గంగా కౌలు రైతులకు న్యాయం చే యాలన్న ఆలోచనలో ఉన్న ప్రభు త్వ ం న్యాయశాఖ అధికారులతో దీనిపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొత్త చట్టాలతో అవినీతి రహిత పాలనను ప్రజలకు అందించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించిన నేపథ్యంలో, తాజాగా కౌలు రైతులకు ఏ విధంగా సాయం చేయాలన్న దానిపై సిఎం పునరాలోచనలో పడ్డట్టు తెలిసింది. రైతుబంధు పథకం అమల్లోకి వచ్చిన తరువాత కౌలు రైతుల పరిస్థితి ఇబ్బందిగా మారడంతో వారికి కూడా న్యాయం చేయాలని ఆయన భావిస్తున్నట్టుగా సమాచారం. దీంతోపాటు మూడేళ్లుగా ప్రగతిలోలేని కౌలు రైతుల గుర్తింపు, రుణ అర్హత కార్డుల జా రీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభు త్వ ం నిర్ణయం తీసుకుంది. వీటిని శా శ్వతంగా రద్దు చేసే దిశగా ప్రభు త్వం కార్యాచరణను రూపొందిస్తుంది. కౌలు రైతుల రక్షణ చట్టం 1950 ప్రకారం గతంలో కౌలు రైతులకు గుర్తింపు దక్కేది. ప్రభుత్వం ఇచ్చిన రుణ అర్హత కార్డులను చూపి బ్యాంకుల నుంచి రుణం పొందేవారు. దీంతో కౌలు రైతుల పంట పెట్టుబడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సాగు చేసుకునే వీలు ఉండేది. దీనికి రుణ అర్హత కార్డులే ప్రామాణికంగా గుర్తించేవారు.
అనుభవదారు కాలమ్ పూర్తిగా తొలగింపు
అయితే తాజాగా ప్రభుత్వం రైతు రుణమాఫీ, రుణబంధు, రైతుబీమా వంటి పథకాలతో అమల్లోకి తీసుకురావడంతో పాటు త్వరలో ఉచిత యూరియా పథకానికి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌలు రైతుల గుర్తింపుతో భూమి యజమానులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనిని కొనసాగింపుగా అధునాతన పట్టాదార్ పాసు పుస్తకాల్లో అనుభవదారు కాలమ్‌ను పూర్తిగా తొలగించింది. కౌలు రక్షిత చట్టం ప్రకారం రుణ అర్హత కార్డులు ఇస్తే అనేక సమస్యలు వస్తాయని భావించిన ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయాన్ని అధ్యయనం చేస్తున్నట్టుగా తెలిసింది. కౌలు రైతుల చట్టం రద్దుపై ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆ తరువాతే పరిష్కార మార్గాలు చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది రబీ ప్రారంభం తరువాత ప్రభుత్వం నిర్వహించిన రైతు సమగ్ర సర్వే కౌలు దారులకు కష్టాలను గురి చేసింది. ఆ తరువాత అదే ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన వారిని మరింత ఇబ్బందులకు గురిచేసింది. రాష్ట్రంలో రైతుల గుర్తింపు సాగు భూమి లెక్కల సేకరణ జరుగుతున్న తరుణంలో కౌలు రైతులకు ఎవరూ భూములను ఇవ్వడం లేదు. 10,854 గ్రామాల్లో జరిగిన భూ రికార్డుల ప్రక్షాళనలో కౌలు రైతు వివరాలను అధికారులు నమోదు చేయలేదు.
ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు
ఈ నేపథ్యంలో మూడు సంవత్సరాలుగా కౌలు రైతుల గుర్తింపు, రుణ అర్హత కార్డుల జారీ నిలిచిపోయింది. దీంతో సాగు విస్తీర్ణంపై ఈ ప్రభావం పడి కౌలు రైతుల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో తాజాగా ముగిసిన ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, అందులో ఇప్పటివరకు 12 లక్షల ఎకరాలు మాత్రమే సాగయినట్టుగా తెలిసింది. ఇది మొత్తం సాగు విస్తీర్ణంలో 50 శాతమేనని ప్రభుత్వ పేర్కొంటుంది. అయితే సాగునీటి వసతి, వ్యవసాయ విస్తీర్ణం ఇతర సౌకర్యాలు పెరిగినప్పటికీ సాగు విస్తీర్ణం తగ్గడం వెనుక కౌలు రైతులకు కరువు కారణంగా ఈ దఫా వరి సాగులో నిమగ్నం కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా అందులో కేవలం 88 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యిందని అధికారులు పేర్కొంటున్నారు.
కౌలు రైతులకు గుర్తింపు లేక రుణాలు అందడం లేదు
గతేడాది జూన్ నెలాఖరులోగా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ అది అమల్లోకి రాలేదు. దీంతో కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడంతో రుణాలు అందడం లేదు. సత్వరమే కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను చేపట్టాలని ఈ ఏడాది ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఈ లోపుగా ఎకరాకు రూ.8వేల పెట్టుబడి సాయాన్ని సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఆ తరువాత రైతు సర్వేను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహించారు. దీంతో ప్రతి ఏడాది గ్రామ సభల ద్వారా కౌలు రైతులకు ఫ్రిబవరిలో రెవెన్యూ అధికారులు గ్రామాల్లో దరఖాస్తు ఫాంలను అందుబాటులో ఉంచి ఫారం 2ను రికార్డుల్లో పేర్లను నమోదు చేయించేవారు. అయితే సిఎం ప్రకటన తరువాత వ్యవసాయ అధికారుల సర్వేలో అసలు భూ యజమానులు తమ భూములను ఇస్తున్నట్టుగా కౌలు కాలమ్‌లో రాయించుకుంటే పెట్టుబడి సాయం కౌలు రైతులకే పోందన్న అనుమానంతో భూమి యజమానులు కౌలుకు భూములను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. పహాణీ, పట్టాదారీ పాసు పుస్తకం, రెవెన్యూ రికార్డుల్లో అవసరం లేని కాలమ్‌లను తొలగించాలని సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఆ కాలమ్‌ను రద్దు చేసినట్టుగా అధికారులు పేర్కొంటున్నారు.

Tenant Farmers Protection Act

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కౌలు రైతుల మేలుకు చట్టం ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: