రేపు సొంతూరుకు సిఎం కెసిఆర్

చింతమడకలో ఏర్పాట్లను పరిశీలించిన హరీష్‌రావు, జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం చింతమడకకు వెళ్ళనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో శనివారం సిద్దిపేట్ జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జె సి పద్మాకర్ ఇతర జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ టి. హరీశ్ రావు ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఈ సందర్భం గా హరీష్‌రావు మాట్లాడుతూ, ఈ నెల 22న తన పురిటి గడ్డ చింతమడక కు కెసిఆర్ రానున్నారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చింతమడక […] The post రేపు సొంతూరుకు సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చింతమడకలో ఏర్పాట్లను పరిశీలించిన హరీష్‌రావు, జిల్లా కలెక్టర్

ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం చింతమడకకు వెళ్ళనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో శనివారం సిద్దిపేట్ జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జె సి పద్మాకర్ ఇతర జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ టి. హరీశ్ రావు ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఈ సందర్భం గా హరీష్‌రావు మాట్లాడుతూ, ఈ నెల 22న తన పురిటి గడ్డ చింతమడక కు కెసిఆర్ రానున్నారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చింతమడక లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. సిఎంకు ఘనస్వాగతం పలికేందుకు గ్రామ ప్రజలు సిద్ధమవుతున్నారన్నా రు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చింతమడకలో దస రా, దీపావళి, ఉగాది పండగలు ఒకేసారి జరుగుతున్న వాతావరణం నెలకొందన్నారు. ఆయనకు చింతమడకతో అవినాభావ సంబందం ఉందని హరీష్‌రావు వెల్లడించారు. కెసిఆర్ ఎంత ఉన్నతస్థాయికి వెళ్లినా చింతమడక ప్రజలతో ఆత్మీయ, సన్నిహిత సంబం ధం కలిగి ఉన్నారన్నారు.

ఈ పర్యటన సందర్భంగా కెసిఆర్ తన సన్నిహితులతో, స్నేహితులతో, ప్రజలతో ఆత్మీయంగా గడపనున్నారని తెలిపారు. వారితో కలిసి భోజనం కూడా చేస్తారన్నారు. సిఎం పర్యటన నేపథ్యంలో గత వారం రోజులుగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. ముఖ్యమంత్రి చింతమడక గ్రామ ప్రజల కోరికలన్నీ తీర్చిబోతున్నారని హరీష్‌రావు తెలిపారు. ఇది కేవలం తన గ్రామస్తులతో కెసిఆర్ మమేకమయ్యే పర్యటన మాత్రమేనని అన్నారు. ఇతరులు ఎవరు చింతమడకకు రావొద్దని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. కెసిఆర్‌ను కలిసేందుకు ఇక్కడు వచ్చి అనవసరంగా ఇబ్బంది పడొద్దని సూచించారు. త్వరలో మరోసారి సిద్దిపేటకు కూడా కెసిఆర్ రానున్నారని తెలిపారు. అప్పుడు అందరిని కలిసే అవకాశం ఉంటుందని హరీష్‌రావు స్పష్టం చేశారు.

CM KCR To Visit His Native Village Chintamadaka

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రేపు సొంతూరుకు సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: