షీలాదీక్షిత్ కన్నుమూత

 హృద్రోగానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత షీ లా దీక్షిత్ కన్నుమూశారు. రాజీవ్ గా ంధీ కేబినెట్‌లో మంత్రిగా, ఢిల్లీకి ఏకబిగిన మూడు దఫాలు, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ విశిష్టతను సాధించుకున్నారు. 81 సంవత్సరాల దీక్షిత్ గత కొంతకాలంగా అస్వస్థతతో ఉంటున్నారు. అయితే శనివా రం మధ్యాహ్నం ఆమెకు గుండెపోటు రావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స దశలోనే మృతి చెందారని […] The post షీలాదీక్షిత్ కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 హృద్రోగానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత షీ లా దీక్షిత్ కన్నుమూశారు. రాజీవ్ గా ంధీ కేబినెట్‌లో మంత్రిగా, ఢిల్లీకి ఏకబిగిన మూడు దఫాలు, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ విశిష్టతను సాధించుకున్నారు. 81 సంవత్సరాల దీక్షిత్ గత కొంతకాలంగా అస్వస్థతతో ఉంటున్నారు. అయితే శనివా రం మధ్యాహ్నం ఆమెకు గుండెపోటు రావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స దశలోనే మృతి చెందారని వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యేగా, ఎంపిగా, పిసిసి అధ్యక్షురాలిగా, కాంగ్రెస్ పార్టీలో ఇంది ర, రాజీవ్‌ల హయాంలో కీలక వ్యూహకర్తగా దీక్షత్ వ్యవహరించారు. కాంగ్రెస్‌లో పాతతరం నేత ఉమాశంకర్ దీక్షిత్ కోడలు అయిన షీలా దీక్షిత్ రాజకీయ ప్రస్థానం 1984లో ఉత్తరప్రదేశ్ నుంచి ఆరంభం అయింది. షీలా భర్త వినోద్ దీక్షిత్ ఐఎఎస్‌గా ఉండేవారు. వారిది ప్రేమ వివాహం ఇతరత్రా అనారోగ్యం, తోడుగా గుండెపోటు రావడంతో ఆమెను రక్షించేందుకు వైద్యులు చేసిన యత్నాలు ఫలించలేదు. మధ్యాహ్నం 3.55 గంటలకు మృతిచెందారని, శనివారం ఉదయమే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఆమె 15 ఏళ్లపాటు సేవలు అందించారు. ఇంతకాలం ఢిల్లీకి సిఎంగా ఎవరూ లేరు.

ఆసుపత్రికి వచ్చిన తరువాత పలు రకాల చికిత్సలతో తాత్కాలికంగా కొంత కుదుటపడిందని, అయితే రెండోసారి గుండెపోటు రావడంతో తాము ఎంతగా యత్నించినా ఫలితం లేకుండా పోయిందని వైద్యుల బృందం తెలిపింది. షీలా దీక్షిత్ భౌతిక కాయాన్ని నిజాముద్దిన్ ఈస్ట్‌లోని ఆమె నివాసానికి తరలించారు. ఆదివారం ఆమె అంత్యక్రియలు నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరుగుతాయని ఢిల్లీ కాంగ్రెస్ విభాగం తెలిపింది. షీలా దీక్షిత్ ప్రస్తుతం ఢిల్లీ పిసిసి అధ్యక్షురాలిగా ఉన్నారు. గత కొంతకాలంగా వరుసగా ఎన్నికల పరాజయాలను ఎదుర్కొంటూ వస్తున్న షీలాదీక్షిత్ గతంలో అత్యంత విజయవంతమైన నాయకురాలిగా పేరొందారు. 1998 నుంచి 2013 వరకూ ఆమె ఢిల్లీ సిఎంగా 15 ఏళ్లు ఉన్నారు. జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలతో సమానంగా పార్టీ వ్యవహారాలలో పాలుపంచుకున్నారు. కేరళ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. న్యూఢిల్లీ విధాన సభ స్థానం నుంచయి పలు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన షీలా దీక్షిత్ ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి ఓడారు. ఉత్తరప్రదేశ్‌లోని కనోజ్ నుంచి షీలా దీక్షిత్ తొలిసారిగా 1984లో ఎంపిగా ఎన్నికయ్యారు.

జీవితమంతా కాంగ్రెస్‌కు అంకితం అయి, నెహ్రూ గాంధీ కుటుంబానికి విధేయురాలిగా వ్యవహరించి, కాంగ్రెస్‌కు ప్రియపుత్రికగా పార్టీ ప్రముఖుల కితాబులు అందుకున్నారు. దీక్షిత్ దక్షతను గుర్తించిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆమెను ఐరాసలో భారతీయ మహిళా కమిషన్‌కు సారధ్య బాధ్యతలను అప్పగించార. 1984 నుంచి 89 వరకూ ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, ప్రధాన మంత్రి కార్యాలయ మంత్రిగా కూడా వ్యవహరించారు. షీలా దీక్షిత్ పంజాబ్‌లోని కపుర్తలాలో 1938 మార్చి 31వ తేదీన జన్మించారు. ఢిల్లీ యూనివర్శిటీలో చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఢిల్లీ, యుపి వంటి ప్రాంతాలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల నుంచి విశేషాభిమానాన్ని సంతరించుకున్నారు. దేశంలో మహిళా ఉద్యమాలతో షీలాకు విశేషానుబంధం ఉంది. మహిళలపై దాడులకు నిరసనగా ఆమె నాయకత్వంలో ఉద్యమాలు చేపట్టారు. ఈ దశలో ఆమె ఇతరులతో పాటు 1990లో పలువురితో పాటు 23 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. 1998లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన షీలా ముఖ్యమంత్రి అయ్యారు. తరువాత వరుసగా మూడు పర్యాయాలు ఈ కీలక పీఠంపై ఉంటూ వచ్చారు.
ఢిల్లీ అంటే దీక్షిత్… పాలనలో భేష్
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేజ్రీవాల్ కితాబులు
షీలా దీక్షిత్ మరణం పట్ల భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె సిఎంగా ఉన్న కాలం రాజధాని విశేష పరిణాత్మక దశకు చేరిందని, ఈ విధంగా ఆమె సేవలు చిరస్మరణీయం అని రాష్ట్రపతి కొనియాడారు. ఆమె పరిపాలనా దక్షత ఆదర్శప్రాయం అని ఉప రాష్ట్రపతి తెలిపారు. ఢిల్లీ అభివృద్ధిలో దీక్షిత్ కీలక పాత్ర చిరస్మరణీయం అని ప్రధాని మోడీ తమ ప్రకటనలో ప్రశంసించారు. ఆమె మరణం ఢిల్లీకి తీరని నష్టం అని కేజ్రీవాల్ చెప్పారు. ప్రజల మనిషి షీలా అని, దేశం అంకితభావపు నాయకురాలిని కోల్పొయిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు.
కాంగ్రెస్ ప్రియ పుత్రిక : రాహుల్
షీలా దీక్షిత్ మృతి వార్త తనకు దిగ్రాంతిని కల్గిచిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆమె పార్టీకి ప్రియ పుత్రిక అన్నారు. తనకు ఆమెతో వ్యక్తిగత ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. ఆమె మూడు పర్యాయాలు నిస్వార్థంతో కాంగ్రెస్ పార్టీ తరఫున సిఎంగా వ్యవహరించారు. పార్టీ పట్ల ఆమె అంకితభావం తనను ఎంతగానో కదిలించివేసిందని, ఇది పార్టీలో అన్ని తరాలకు స్ఫూర్తిగా నిలవాల్సి ఉందని రాహుల్ చెప్పారు. పార్లీలో పదవులు ప్రాధాన్యతలతో నిమిత్తం లేకుండా కూడా ఆమె పార్టీకి పలువిధాలుగా సేవలు అందించారని కొనియాడారు.

Former Delhi CM Sheila Dikshit passes away at 81Years Old

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post షీలాదీక్షిత్ కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.