మార్కెట్లు బేజారు

(గతవారం మార్కెట్ సమీక్ష) ముంబై : ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ అంచనాల కంటే మెరుగైన జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంతో గత వారంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభించాయి. చాలా వరకు క్యూ 1 ఫలితాలు సంతోషం కల్గించేలా ఉన్నాయి. విప్రో, కోల్‌గేట్ మంచి గణాంకాలను నమోదు చేశాయి. మరోవైపు యస్ బ్యాంక్ మాత్రం ప్రతికూలత ఫలితాలతో షేరు దెబ్బతిన్నది. ఏదేమైనా లోక్‌సభలో ఆర్థిక బిల్లు ఆమోదించబడిన తరువాత వారం గడువులో అమ్మకాలు వెల్లువెత్తాయి. బడ్జెట్‌పై పెట్టుబడిదారుల […] The post మార్కెట్లు బేజారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
(గతవారం మార్కెట్ సమీక్ష)

ముంబై : ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ అంచనాల కంటే మెరుగైన జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంతో గత వారంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభించాయి. చాలా వరకు క్యూ 1 ఫలితాలు సంతోషం కల్గించేలా ఉన్నాయి. విప్రో, కోల్‌గేట్ మంచి గణాంకాలను నమోదు చేశాయి. మరోవైపు యస్ బ్యాంక్ మాత్రం ప్రతికూలత ఫలితాలతో షేరు దెబ్బతిన్నది. ఏదేమైనా లోక్‌సభలో ఆర్థిక బిల్లు ఆమోదించబడిన తరువాత వారం గడువులో అమ్మకాలు వెల్లువెత్తాయి.

బడ్జెట్‌పై పెట్టుబడిదారుల ఆశలు నిరాశలు అయ్యాయి. ఇదే సమయంలో బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు వారంలో 5.50 శాతానికి పైగా పడిపోయాయి. క్యూ 1 ఫలితాలు, వినియోగం, బ్యాంకింగ్, ఆర్థిక ఫలితాలు మార్కెట్లో పాల్గొనేవారి కోసం వాచ్‌లిస్ట్‌లో ఉంటాయి. మందగమనం, లిక్విడిటీ రెండు ప్రధాన అంశాలు చూస్తే వీటిలో ఏదైనా సానుకూలంగా ఉంటే ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చినట్టవుతుంది. ప్రస్తుతం దలాల్ -స్ట్రీట్ నిస్తేజంగా ఉంది.

గతవారం ‘డల్’గా దలాల్ స్ట్రీల్

గత వారం మొత్తంగా చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ 399.22 పాయింట్లు నష్టపోయింది. జులై 12న సెన్సెక్స్ 38,736 పాయింట్ల వద్ద ఉండగా, జులై 19న వారాంతం నాటికి 38,337 పాయింట్లకు పడిపోయింది. మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కీలక 11,500 పాయింట్ల మార్క్ దిగువకు పడిపోయింది. త్రైమాసిక ఫలితాలు లేకపోవడం, వినిమయం మందగించడం, అత్యధిక వాల్యుయేషన్లు కొనుగోలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయని ట్రేడర్లు పేర్కొంటున్నారు.

ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 560.45 పాయింట్లు నష్టపోయి 38,337 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 177.65 పాయింట్లు కోల్పో యి 11,419 పా యింట్ల వద్ద స్థిరపడిం ది. 2019లో సెన్సెక్స్‌కు ఇది రెండో అతిపెద్ద పతనం. బడ్జె ట్ అనంతరం జూలై 8న సెన్సెక్స్ అత్యధికంగా 792 పాయింట్లు పతనమైంది. ఆ తర్వాత రెండోసారి భారీ నష్టం ఇదే. అయితే గురువారం, శుక్రవారం రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.3.79 లక్షల కోట్లు హరించుకుపోయింది. బిఎస్‌ఇ లిస్టెట్ కంపెనీల మార్కెట్ విలువ రూ.145 లక్షల కోట్లకు తగ్గింది.

ఎఫ్‌పిఐ పన్ను ఊరట ఏది?

‘ఎఫ్‌పిఐ’లకు(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) పన్ను ఊరట ఆశలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో సూచీలు వారాంతం మరింతగా నష్టాలను చూడాల్సి వచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. ఆర్థిక మందగమన ఆందోళలు, ఎన్‌బిఎఫ్‌సి రంగంలో ద్రవ్య కొరత కొనసాగుతుడ టం తదితర అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. దీనికి తోడు ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించిన సంపన్న వర్గాలపై మరింత పన్ను అంశంపై పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి కీలక వా ఖ్యలు చేశారు. సంపన్న వర్గాలపై సర్‌చార్జీ భారా న్ని తగ్గించుకునేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ట్రస్టులుగా కాకుండా సంస్థలుగా నమోదు చేసుకోవాలని, అలా చేయకపోతే కొత్త టాక్స్ సర్ ఛార్జీలు చెల్లించక తప్పదని స్పష్టం చేశారు.

సీతారామన్ వివరణతో విదేశీ ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఈ అంశం మా ర్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ని పుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బడ్జె ట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి నిన్నటి వరకు ఎఫ్‌ఐఐలు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.5000 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్సు, ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతీ సుజుకీ, ఐషర్ మోటార్స్ నష్టపోయాయి.

weekly stock market update

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మార్కెట్లు బేజారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.