తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాల్లో 5.8 కి.మీల ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం జులై 20 వ తేదీన దక్షిణ చత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి వైపునకు వంపు తిరిగి ఉందని అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో […] The post తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాల్లో 5.8 కి.మీల ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం జులై 20 వ తేదీన దక్షిణ చత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి వైపునకు వంపు తిరిగి ఉందని అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో 3.1 కి.మీల నుంచి 5.8 కి.మీల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో శనివారం రాత్రి భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ఆంధ్ర, యానాంలలో శనివారం రాత్రి భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాయలసీమలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Rains in Telangana Next Two Days

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: