మనకు కావాల్సిన దాని కోసం పోరాటం చేయాలి…

  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ట్యాగ్‌లైన్. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ను పొందిన ఈ చిత్రాన్ని ఈనెల 26న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల […] The post మనకు కావాల్సిన దాని కోసం పోరాటం చేయాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ట్యాగ్‌లైన్. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ను పొందిన ఈ చిత్రాన్ని ఈనెల 26న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ హైదరాబాద్‌లో మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో సినిమాలోని పాటలను లైవ్‌గా ప్రదర్శించడమే కాకుండా విజయ్ దేవరకొండ, రష్మిక స్టేజ్‌పై ఈ పాటలకు డ్యాన్సులు చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “మనందరిలో చాలా భయాలుంటాయి. అయితే వాటిని వదిలేస్తేనే మనం గెలుస్తాం. నేను కూడా నటుడు కావాలనుకున్నప్పుడు భయమేసింది. మనకు కావాల్సిన దాని కోసం పోరాటం చేయాలి. అప్పుడే విజయం దక్కుతుంది. ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నమే ‘డియర్ కామ్రేడ్’ సినిమా. ఇక బెంగుళూర్, కొచ్చి, చెన్నైలో మ్యూజిక్ ఫెస్టివల్స్ చేశాం.

ప్రేక్షకులు ప్రతిచోటా మాకు ప్రేమనే పంచారు. ఇంత ప్రేమకు థాంక్స్ చెబితే సరిపోతుందా? అనిపించింది. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో వస్తున్నాం. దక్షిణాది భాషల్లో చేసిన తొలి ప్రయత్నమిది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది”అని అన్నారు. రష్మిక మందన్న మాట్లాడుతూ “నేను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు చాలా మంది వద్దనే అన్నారు. సినిమా రంగం శ్రేయస్కరం కాదని చెప్పారు. అయితే నేను ప్రేమించిన దాని కోసం కష్టపడ్డాను. అందరినీ ఒప్పించాను. ఇక ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా ఇది. అందరూ ప్రేమించిన దాని కోసం పోరాటం చేయాలి”అని తెలిపారు.

We must Fight for what we want

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మనకు కావాల్సిన దాని కోసం పోరాటం చేయాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: