‘బిగ్‌బాస్‌’వివాదం…నాగార్జున ఇంటి ముట్టడి

  హైదరాబాద్‌: ఈ నెల 21న తెలుగులో ప్రారంభం కానున్న ‘బిగ్‌బాస్‌-3’ రియాల్టీ షోకు కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే, బిగ్‌బాస్‌ షోను నిలిపివేయాలని ఓయూ జెఏసి విద్యార్థులు జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంటిముందు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని పోలీసు స్టేషన్ కు తరలించి, నాగార్జున ఇంటి చుట్టూ పోలీసులు భద్రతను పెంచారు. బిగ్ బాస్ వివాదంపై నాగార్జున కనీసం స్పందించడం లేదని, మహిళలను కించపరిచే షో కి ఆయన ఏలా […] The post ‘బిగ్‌బాస్‌’ వివాదం… నాగార్జున ఇంటి ముట్టడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: ఈ నెల 21న తెలుగులో ప్రారంభం కానున్న ‘బిగ్‌బాస్‌-3’ రియాల్టీ షోకు కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే, బిగ్‌బాస్‌ షోను నిలిపివేయాలని ఓయూ జెఏసి విద్యార్థులు జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంటిముందు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని పోలీసు స్టేషన్ కు తరలించి, నాగార్జున ఇంటి చుట్టూ పోలీసులు భద్రతను పెంచారు. బిగ్ బాస్ వివాదంపై నాగార్జున కనీసం స్పందించడం లేదని, మహిళలను కించపరిచే షో కి ఆయన ఏలా వ్యాఖ్యాతగా ఉంటారని ఓయూ జెఏసి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్య‌క్ర‌మంపై కొద్ది రోజులుగా అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ షోను అడ్డుగాపెట్టుకొని బిగ్‌బాస్‌ నిర్వాహకులు కాస్టింగ్ కౌచ్ నిర్వహిస్తున్నారని, తమను ఈ షోకు ఎంపికచేసినట్లు చెప్పి ఆసభ్యంగా ప్రవర్తించారంటూ జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి కూడా ఈ షోను బ్యాన్ చేయాల‌ని హైకోర్టును కోరారు.

Bigg Boss-3 should be stopped: OU JAC

The post ‘బిగ్‌బాస్‌’ వివాదం… నాగార్జున ఇంటి ముట్టడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: