వారణాసి: మృతుల కుటుంబాలను కలుసుకునే వరకు తాను వెనుదిరిగి వెళ్లేది లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బైఠాయించడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని చునార్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సోంభద్ర జిల్లాలోని ఉంభ గ్రామంలో ఇటీవల భూ వివాదం కారణంగా ఘర్షణలు చెలరేగి కాల్పులలో 10 మంది మరణించడంతో మృతుల కుటుంబాలను పరామర్శించడానికి శుక్రవారం గ్రామానికి బయల్దేరిన ప్రియాంక గాంధీని చునార్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా చునార్ ఫోర్ట్ అతిథి గృహంలో గడిపిన ప్రియాంక తన అరెస్టుకు కారణాలు చెప్పాలని, మృతుల కుటుంబాలను పరామర్శించడానికి తనకు అనుమతి ఇవ్వాలని డిమాండు చేస్తూ శనివారం ఉదయం అతిథి గృహం వద్ద ధర్నా చేపట్టారు.
ఉంభ గ్రామాన్ని సందర్శించకుండా తాను వెనుదిరిగి వెళ్లే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. తాను ఒంటరిగా గ్రామానికి వెళతానని, మృతుల కుటుంబాలను విడిగా కలుసుకోవడానికి తనను అనుమతించాలని ఆమె డిమాండు చేశారు. మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కాని, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరూ కాని పరామర్శించలేదని ఆమె దుయ్యబట్టారు. బాధిత కుటుంబాల నోళ్లు మూయించడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తాము ప్రజల గొంతుకగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు.
ప్రియాంక నిర్బంధంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసిస్తోంది. ఆమె నిరసనలో పాల్గొనడానికి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ రాఘెల్ బయలుదేరి వెళుతున్నారు. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సారథ్యంలో జైపూర్‌లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలియచేయనున్నాయి. ప్రియాంక గాంధీని అడ్డుకోవడం ద్వారా తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి యోగి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిఎల్ పునియా ఆరోపించారు.
Priyanka protests over her detention, Along with Congress workers Priyanka Gandhi staged sit in at Chunar fort guest house in UP
Priyanka Gandhi sits on dharna in Mirzapur
Related Images:
[See image gallery at manatelangana.news]The post తగ్గేది లేదు..ముందుకు సాగుతా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.