ప్రియాంక గాంధీ అరెస్ట్ పై రాబర్ట్ వాద్రా స్పందన

  న్యూఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీని ఉత్తరప్రదేశ్ లోని నారాయణపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని సోన్ భద్ర జిల్లాలోని సపాహీ గ్రామంలో చోటు చేసుకున్న ఓ భూతగాదాలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ వెళ్లారు. అయితే ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ కొనసాగుతున్నందున ఎలాంటి పర్యటనలను అనుమతించబోమని నారాయణపూర్ పోలీసులు ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ […] The post ప్రియాంక గాంధీ అరెస్ట్ పై రాబర్ట్ వాద్రా స్పందన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీని ఉత్తరప్రదేశ్ లోని నారాయణపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని సోన్ భద్ర జిల్లాలోని సపాహీ గ్రామంలో చోటు చేసుకున్న ఓ భూతగాదాలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ వెళ్లారు. అయితే ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ కొనసాగుతున్నందున ఎలాంటి పర్యటనలను అనుమతించబోమని నారాయణపూర్ పోలీసులు ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా స్పందించి, హింసాత్మక ఘటనలో మరణించిన వారి కుటుంబీకులను పరామర్శించడం నేరమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రియాంక అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని, ఆమెను వెంటనే విడుదల చేయాలని రాబర్ట్ వాద్రా డిమాండ్ చేశారు. యూపి ప్రభుత్వం నియంతృత్వ ధోరణినికి పాల్పడుతుందిన మండిపడ్డారు.

Robert Vadra slams UP govt over Priyanka Gandhi arrest

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రియాంక గాంధీ అరెస్ట్ పై రాబర్ట్ వాద్రా స్పందన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: