హైదరాబాద్: తెలంగాణ సిఎం కె.చంద్రశేఖరరావు ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతికి అర్హుడని సీనియర్ ఐఎఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ, జల్‌శక్తి అభిమాన్ బృందం సభ్యుడు విపిన్ చంద్ర తెలియజేశారు. ఈ సందర్భంగా విపిన్ చంద్ర మాట్లాడుతూ… జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ను ఇటీవల సందర్శించిన ఆయన దీని ఆయకట్టు 45,000 ఎకరాలలో సుమారు 235 టిఎంసిల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు అని తెలియజేశారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును దాదాపు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని దాదాపు 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చనుందని విపిన్ చంద్ర వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. భవిష్యత్తులో మూడో ప్రపంచయుద్ధం జరిగితే అది నీటి కోసమేనని ఆయన పేర్కొన్నారు. ఎస్సారెస్పి పునరుజ్జీవ పథకం వ్యూహకర్త అయిన కెసిఆర్ నోబల్ బహుమతికి అన్ని విధాలా అర్హుడని విపిన్ చంద్ర అభిప్రాయపడ్డారు.
CM KCR deserves for nobel prize says IAS Vipin Chandra
Related Images:
[See image gallery at manatelangana.news]The post కెసిఆర్ నోబెల్ బహుమతికి అర్హుడే: ఐఎఎస్ అధికారి విపిన్ చంద్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.