శాసనసభ నిరవధిక వాయిదా

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పురపాలక చట్టం -2019కి సంబంధించిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. గురువారం, శుక్రవారం రెండు రోజులపాటు 4 గంటల 44 నిమిషాల పాటు శాసనసభ జరిగిన శాసన సభ సమావేశాల్లో ఐదు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. గురువారం ఒక్కరోజే శాసనసభ నాలుగు బిల్లులకు ఆమోదం తెలపగా, శుక్రవారం మరో బిల్లుకు ఆమోదం తెలిపింది. గురువారం మెడికల్ ప్రొఫెసర్ల వయో […] The post శాసనసభ నిరవధిక వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పురపాలక చట్టం -2019కి సంబంధించిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. గురువారం, శుక్రవారం రెండు రోజులపాటు 4 గంటల 44 నిమిషాల పాటు శాసనసభ జరిగిన శాసన సభ సమావేశాల్లో ఐదు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. గురువారం ఒక్కరోజే శాసనసభ నాలుగు బిల్లులకు ఆమోదం తెలపగా, శుక్రవారం మరో బిల్లుకు ఆమోదం తెలిపింది. గురువారం మెడికల్ ప్రొఫెసర్ల వయో పరిమితి పెంపు బిల్లు, తెలంగాణ మున్సిపల్ చట్టం(సవరణ) బిల్లు, పంచాయతీ రాజ్ 2వ సవరణ బిల్లు, తెలంగాణ రైతు రుణ విమోచన కమిషన్ బిల్లులకు శాసనసభ ఆమోదం పొందగా, శుక్రవారం తెలంగాణ మున్సిపల్ చట్టం- 2019కు శాసనసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ పురపాలక చట్టంపై అభిప్రాయాలు తెలిపిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

సభ్యుల సూచనలు, సలహాలు స్వీకరిస్తామన్నారు. జనాభా దామాషా ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేస్తామని, సమయానుకూలంగా చట్టంలో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కెసిఆర్ అన్నారు. సరైన మార్పులు చేయకపోతే భావితరాలకు మనం ద్రోహం చేసినట్లవుతుందని తెలిపారు. కలెక్టర్‌కు అధికారాల అంశంపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, అయితే కలెక్టర్ వ్యవస్థను కించపరిచేలా సూచనలు చేయడం సరికాదని కెసిఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రతి అంశంలోనూ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారని, నీటి ప్రాజెక్టుల విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవాలని కోర్టులో వందల కేసులు వేస్తున్నారని ఆరోపించారు. సరైన ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేపడుతుంటే అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.
నియోజకవర్గ సమస్యలను నా దృష్టికి తీసుకురండి : సిఎం
తమ నియోజకవర్గాలలో ఏమైనా సమస్యలు ఉంటే ఎంఎల్‌ఎలు నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్యను పరిష్కరించేలా చూస్తామని సిఎం కెసిఆర్ అన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఒక్క సిసి రోడ్డు వేయడానికి ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుందని, ఇలాంటి సమస్యలు అధికారుల దృషికి తీసుకెళ్లినా స్పందించడం లేదని బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ అడిగిన ప్రశ్నకు సిఎం సమాధానం చెప్పారు. సిఎంను కలవడానికి ఎవరిని సంప్రదించాలని రాజాసింగ్ అడుగగా, ముఖ్యమంత్రిని కలవడానికి ఒక పద్దతి ఉంటుందని సిఎం బదులిచ్చారు.

Telangana Assembly passed Telangana Municipal Act

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శాసనసభ నిరవధిక వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: