ఆమెనీతి

n మూడేళ్ల కాలంలో రూ. 700 కోట్ల కొనుగోళ్లు n డైరెక్టర్ దేవికారాణి వాటా రూ. 200 కోట్లు n బినామీ కంపెనీల్లో కుమారుడు వాటాదారుడు n తవ్వేకొద్ది బయటపడుతున్న అవినీతి బాగోతం n విజిలెన్స్ రిపోర్టులో విస్తు పోయే విషయాలు n ఇఎస్‌ఐ స్కాంలో ఓ ఛానెల్ ప్రతినిధిది కీలక పాత్ర మనతెలంగాణ/హైదరాబాద్ : ఇఎస్‌ఐ స్కామ్ కేసులో డైరెక్టర్ దేవికారాణి అవినీతి తవ్వేకొద్ది వెలుగుచూస్తూనే ఉన్నాయి. కేవలం మూడేళ్ల కాలంలో దేవికారాణి రూ. 200 […] The post ఆమెనీతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

n మూడేళ్ల కాలంలో రూ. 700 కోట్ల కొనుగోళ్లు
n డైరెక్టర్ దేవికారాణి వాటా రూ. 200 కోట్లు
n బినామీ కంపెనీల్లో కుమారుడు వాటాదారుడు
n తవ్వేకొద్ది బయటపడుతున్న అవినీతి బాగోతం
n విజిలెన్స్ రిపోర్టులో విస్తు పోయే విషయాలు
n ఇఎస్‌ఐ స్కాంలో ఓ ఛానెల్ ప్రతినిధిది కీలక పాత్ర

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇఎస్‌ఐ స్కామ్ కేసులో డైరెక్టర్ దేవికారాణి అవినీతి తవ్వేకొద్ది వెలుగుచూస్తూనే ఉన్నాయి. కేవలం మూడేళ్ల కాలంలో దేవికారాణి రూ. 200 కోట్ల మేరకు అక్రమంగా ఆర్జించినట్లు విజిలెన్స్, ఎసిబి దర్యాప్తులో వెలుగుచూసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంపై ఎసిబి, విజిలెన్స్ ఉన్నతాధికారులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ అవినీతి వ్యవహారంలో ఐఏఎస్ అధికారి, డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, సూపరిండెంట్‌తో పాటు ఓ ఛానెల్ ప్రతినిధి హస్తం ఉన్నట్లు విజిలెన్స్, ఎసిబి అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్య ంలో 80 పేజీల దర్యాప్తు నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఇఎస్‌ఐలో కీలక ఉద్యోగులతో పాటు ఛానెల్ ప్రతినిధి ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవిక రాణి బినామీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సదరు ఛానెల్ ప్రతినిధి పేరుతో పలుచోట్ల ఆస్తులు, వాహనాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.ఇదిలావుండగా 2013 వరకు తేజ ఫార్మ వ్యాపారంలో రాణించలేదు. కాగా దేవికారాణి ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా విధులు చేపట్టినప్పటి నుంచి తేజఫార్మ పుంజుకుంది.

తేజాఫార్మను బినామీగా చేసుకుని మందుల కొనుగోళ్లకు పాల్పడినట్లు తేలింది. తేజాఫార్మ లో దేవికారాణి తనకు కుమారుడిని వాటా దారునిగా చేసి మందుల కొనుగోళ్లు జరిపింది. అలాగే దేవికారాణి కుమారుడిని ఒరిజిన్ ఫార్మా,సెరిడియా కంపెనీలలో వాటా దారునిగా చేసి పెద్ద ఎత్తున ఆయా కంపెనీల నుంచి వైద్య పరికరాలు, మందులు కొనుగోలు చేసినట్లు విజిలెన్స్, ఎసిబి అధికారుల దర్యాప్తులో వెలుగు చూసి ంది. ఈక్రమంలో ఒరిజిన్ కంపెనీ యజమాని శ్రీకాంత్, తేజాఫార్మా అధినేత రాజేష్, మందుల సరఫరా దారుడు శంకర్‌లు ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి బినామీలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దేవికారాణి ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన 2014 నుంచి ప్రభుత్వ ధనాన్ని దిగిమింగసాగింది, బినామి మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో చేతులు కలిపి మందులు సరఫరా కానప్పటికీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టింది. మందుల వైద్య పరికరాల స్టాక్ ఎంట్రి రికార్డులో తన చేతి వాటం చూపుతూ దశల వారీగా రూ.200 కోట్ల మేర అక్రమంగా ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు.

ఇఎస్‌ఐ మెడికల్ డిస్పెన్సరీలకు కేవలం రూ. 10వేల మందులు సరఫరా చేసి రూ.1 బిల్లులకు సృష్టించి సర్కారు ఖజానాను కొల్లగొట్టిందని, అలాగే మందుల కంపెనీల నుంచి 20శాతం కమీషన్ సైతం తీసుకుందని విచారణలో వెలుగుచూసింది.అలాగే మెడిసన్ సప్లై బిల్లులోనూ 5 శాతం తీసుకున్నట్లు రుజువైంది. ఈ క్రమంలో ఒకే సంవత్సర కాలంలో రూ.300 కోట్ల మందులను బినామీ కంపెనీల నుంచి కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో 2014 నుంచి 2018 మధ్య కాలంలో రూ. 700 కోట్ల మందులను బినామీ కంపెనీలకు అప్పగించింది. కాగా 2018 జూలైలో ఒక్కసారిగా నకిలీ బిల్లులు సమర్పించి రూ.60 కోట్లు అబిడ్స్‌లోని పే అండ్ అకౌంట్స్ విభాగం నుంచి రహస్యంగా తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు కార్యాలయ అటెండర్ రమేష్‌బాబు, క్లర్క్ ఉపేందర్, సూపరింటెండెంట్ వీరన్నలు కీలక పాత్ర వహించారు.

దేవికారాణి బినామీల కథాకమామిషు
మొదటి బినామి నాగలక్ష్మి: ఇఎస్‌ఐ డిపార్ట్‌మెంట్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న నాగలక్ష్మిని పర్చేసింగ్ విభాగంలో విధుల అప్పగించి దోపిడికి పాల్పడటమే కాకుం డా నాగలక్ష్మిని బినామీగా మార్చుకున్నట్లు విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఫార్మసిస్ట్ నాగలక్ష్మి డైరెక్టర్ దేవికారాణికి కుడి భుజంగా ఉంటూ 5 మందుల కంపెనీలకు బినామీగా ఉంటూ వచ్చింది. ఒక దశలో ఇఎస్‌ఐలో నాగలక్ష్మి షాడో డైరెక్టర్‌గా వ్యవహరించిందని అధికారులు సమర్పించిన రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇఎస్‌ఐ అవినీతి భాగోతంలో తన వంతు పాత్ర పోషించిన నాగలక్ష్మి దాదాపు రూ.50 కోట్ల మేర అక్రమంగా ఆర్జించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
రెండవ బినామి నావాజ్ రెడ్డి : ఇఎస్‌ఐలో అన్ని రకాల సర్జికల్ పరికరాల కొనుగోలులో సిడిఎస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నవాజ్‌రెడ్డి డైరెక్టర్ దేవికారాణికి రెండవ బినామీగా వ్యవహరించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. బినామీ కంపెనీల పట్ల పూర్తి అవగాహన ఉన్న నావాజ్ రెడ్డి సర్జికల్ పరికరాల కొనుగోలులో బినామీ కంపెనీలు సృష్టించి దాదాపు రూ.95 కోట్ల నిధుల స్వాహాకు సహకరించినట్లు గుర్తించారు. ఈక్రమంలో నవాజ్‌రెడ్డి రూ.30 కోట్లు తన వాటా తీసుకుని సంగారెడ్డి, గచ్చిబౌలి, బిహెచ్‌ఇఎల్‌లో భూములు కొన్నట్లు విచారణలో వెల్లడైంది.
మూడవ బినామీ వీరన్న : ఇఎస్‌ఐలో అకౌంట్స్ విభాగంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వీరన్న డైరెక్టర్ దేవికారాణి బినామీగా వ్యవహరించినట్లు అధికారుల విచారణలో తేలింది. వీరన్న తన పెన్‌డ్రైవ్‌లో బినామీ కంపెనీల జాబితా లభ్యమైంది. ప్రభుత్వం నుంచి ఇఎస్‌ఐకి బిల్లులు పొందే విషయంలో వీరన్న కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. ఈక్రమంలో ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి అవినీతికి సహకరించిన వీరన్న రూ. 40 కోట్లు అక్రమంగా ఆర్జించి తన తండ్రి, సోదరుడి పేరిట భూములు కొన్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
బినామీ కంపెనీల జాబితా : ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి అక్రమాలలో భాగంగా పుట్టుకొచ్చిన బినామీ కంపెనీలను అధికారులు గుర్తించారు. వాటిలో పృధ్వి ఎంటర్ ప్రైజెస్, మైత్రి ఫార్మా, మహిధర మెడికల్, సర్జికల్స్, ఆర్‌ఆర్ ట్రేడర్స్, వైష్ణవ ఎంటర్‌ప్రైజెస్, గాయత్రి ఫార్మా, వసుధా మార్కెటింగ్ ఫార్మాస్కుటికల్, సర్జికల్ డిస్టిబ్యూటర్స్, సికోత్రిక్ ఫార్మా, స్వస్తిక్ ఫార్మాస్కుటికల్స్, హిమాలయ ఫార్మా, శ్రీరామ ఫార్మా డిస్టిబ్యూటర్స్, గాయత్రి ఫార్మాలున్నాయని విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
ప్రభుత్వ నిధుల విడుదల : ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా దేవికారాణి విధులు చేపట్టిన కాలంలో ప్రభుత్వం దాదాపు 500 కోట్ల రూపాయలు కేవలం మందుల కొనుగోలుకు విడుదల చేసింది. ఈక్రమంలో 2015, 2016లో రూ. 143 కోట్లు, 2016,2017 కాలంలో రూ. 120 కోట్లు. 2017 నుంచి 2018లో రూ. 208 కోట్ల రూపాయల మేర బడ్జెట్ నుంచి నిధులను విడుదల చేసింది.
కొనుగోలు నిబంధనలకు మంగళం : ఇఎస్‌ఐ ఆస్పత్రులకు మందులు, వస్తువులు, మిషనరీల కొనుగోలులో నిబంధనలు పాటించలేదు. రూ.25లక్షలు అంతకు మించి విలువైన టెండర్లకు తప్పనిసరిగా దిన పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. టెండర్‌కు సంబంధించిన ప్రకటన రెండు జాతీయ దినపత్రికల్లో ఇవ్వాలి. దీనిని ఎక్కడా పాటించలేదు.
అత్యవసర పరిస్థితుల్లోనే సింగిల్ టెండర్ : ఆస్పత్రులకు వస్తువులు,మందులు, మిషనరీలు అత్యవసరం ఉన్నప్పుడు నిపుణుల సలహా మేరకు కొనుగోలు చేయాలి. ఇక్కడ అలాంటివి పాటించలేదు. ఇష్టాను సారం కొనుగోలు చేశారు.
ఇండెంట్ల బేఖాతర్ : డైరెక్టర్ వివిధ డిస్పెన్సరీలు, జాయింట్ డైరక్టర్లు, మెడికల్ సూపరింటెండ్‌ల నుంచి ఇండెంట్లు తీసుకుని మందులకు ఆర్డర్ ఇవ్వాలి. కానీ డైరక్టర్ వారి వద్ద నుంచి ఎలాంటి ఇండెంట్ తీసుకోలేదు. మందుల కొనుగోలును కేంద్రీకరించారు.
డ్రగ్ ప్రొక్యూర్‌మెంట్ కమిటీ అనుమతి నిల్ : డిస్‌స్పెన్సరీలు, ఆస్పత్రులకు సరఫరా చేసే డ్రగ్స్, సర్జికల్ ఐటమ్స్‌ను ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సిఫార్సుల మేరకు కొనుగోలు చేసి పంపిణీ చేయాలి. కనీసం కమిటీని ఎక్కడ పరిగణలోకి తీసుకోలేదు. ఓపెన్ టెండర్ విధానాన్ని ఎక్కడా పాటించలేదు. కాంట్రాక్టును ఎంపిక చేసిన కంపెనీకి ఏడాదికి మాత్రమే ఉంటుంది.
ప్రాణాలు కాపాడే డ్రగ్స్ అవినీతే : మెడికల్ సూపరింటెండ్స్ ప్రాణాలు కాపాడే డ్రగ్స్‌ను రూ.25,000లకు మించకుండా కొనుగోలు చేయవచ్చు. దీనికి ఎలాంటి టెండర్ అవసరంలేదు. లోకల్ కొనుగోలు కమిటీ అనుమతితో రూ.15,000 నుంచి రూ.1,00,000వరకు కొనుగోలు చేయవచ్చు. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారు.
నింబధనలకు నీళ్లు : రిజిస్టర్డ్ కంపెనీల వద్ద మాత్రమే వస్తువులు, మిషనరీలు, మందులు కొనుగోలు చేయాలి. డైరెక్టర్ మందులు కొనుగోలు చేసినట్లు చూపిన ఆర్‌ఆర్ ట్రేడర్స్ సూర్యానగర్, ఓల్డ్ ఆల్వాల్ 2016,ఫిబ్రవరి నుంచి ఉంది. కాని అధికారులు తనిఖీ చేసేందుకు వెళ్లినప్పుడు మూసివేసి ఉంది. ఈ షాపు నేలలో మూడు, నాలుగురోజులు మాత్రమే తెరుస్తారని తెలిసింది. బిల్లులు పరిశీలించగా ఈఎస్‌ఐకి 97శాతం మందులు 2016-17లో సప్లయ్ చేసినట్లు తేలింది. సరిగా తెరవని షాపు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎలా మందులు కొనుగోలు చేశారు. 2016,2017,2018లో మందులు సరఫరా చేసినందుకు డైరెక్టర్ రూ. 3,08,96,908, రూ.1,52,99,760 చెల్లించారు. ఈ షాపు యజమానిగా చెబుతున్న మైస సుధాకర్ తాడ్‌బండ్‌లోని తేజఫార్మాలో నెలకు రూ.16,000 జీతానికి పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇన్ని కోట్ల వ్యాపారం చేసే వ్యక్తి వేరే షాపులో ఎందుకు పనిచేస్తాడు. ఈ వ్యక్తి దేవికారాణి బినామిగా నియమించినట్లు తెలిసింది.
కమిటీల మాటే లేదు : ప్రతి ఏడాది మందులు కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ కమిటీలు ఏర్పాటు చేయాలని కాని దేవికారాణి ఏ ఒక్క కమిటీని ఏర్పాటు చేయలేదు. డ్రగ్స్ ప్రొక్యూర్‌మెంట్ కమిటీ మందులు ఏవి కావాలో సమావేశం అయి కొనుగోలు చేయాలి కాని, కమిటీ లేకపోవడంతో ఇష్టం వచ్చిన మందులు కొనుగోలు చేశారు. డిస్పెన్సరీల నుంచి వచ్చిన ఇండెంట్లను తనిఖీ చేయకుండా మందులు ఆర్డర్ ఇచ్చారు. మందులు సరఫరా చేసిన తర్వాత ఔట్ వార్డ్ వద్ద ఎవరి సంతకం లేకుండా రిజిష్ట్రార్‌లో ఉంది. మరి మందులు ఎక్కడికి వెళ్లానేది తేలాల్సి ఉంది. మిషనరీలు కొనుగోలు చేసినట్లు చూపారు కాని అవి ఆస్పత్రులకు సరఫరా కాలేదు. మధ్యలోనే మాయమయ్యాయి వాటిని రేట్ కాంట్రాక్ట్‌లో చేర్చలేదు.

 ACB Initiates Enquiry Into ESI Medicine Supply Scam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆమెనీతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.