సోన్‌భద్ర బాధితుల పరామర్శ దారిలో ప్రియాంక అరెస్టు..

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అరెస్టు తీవ్ర ఆందోళనకు దారితీసింది.రాష్ట్రంలోని సోన్‌భద్రలో ఘర్షణల బాధిత కుటుంబాలను కలుసుకునేందుకు ప్రియాంక వెళ్లుతుండగా ఆమెను పోలీసులు అడ్డగించారు. ఆమెను వెంట ఉన్న కార్యకర్తలను అదుపులోకి తీసుకుని గెస్ట్‌హౌస్‌కు తరలించారు. తాను సోన్‌భద్రకు వెళ్లితీరుతానని, తనను అడ్డగించడం తగదని పేర్కొంటూ ప్రియాంక రోడ్డుపై భైఠాయించారు. పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. సోన్‌భద్రలో ఓ భూవివాదంలో గిరిజన కుటుంబానికి చెందిన పది మంది […] The post సోన్‌భద్ర బాధితుల పరామర్శ దారిలో ప్రియాంక అరెస్టు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అరెస్టు తీవ్ర ఆందోళనకు దారితీసింది.రాష్ట్రంలోని సోన్‌భద్రలో ఘర్షణల బాధిత కుటుంబాలను కలుసుకునేందుకు ప్రియాంక వెళ్లుతుండగా ఆమెను పోలీసులు అడ్డగించారు. ఆమెను వెంట ఉన్న కార్యకర్తలను అదుపులోకి తీసుకుని గెస్ట్‌హౌస్‌కు తరలించారు. తాను సోన్‌భద్రకు వెళ్లితీరుతానని, తనను అడ్డగించడం తగదని పేర్కొంటూ ప్రియాంక రోడ్డుపై భైఠాయించారు. పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. సోన్‌భద్రలో ఓ భూవివాదంలో గిరిజన కుటుంబానికి చెందిన పది మంది దారుణ హత్య కు గురయ్యారు. శుక్రవారం ఉదయం ప్రియాంక వారణాసికి చేరుకున్నారు. అక్కడ బిహెచ్‌యు చికిత్సా కే్ంర దంలో చికిత్స పొందుతున్న సోన్‌భద్ర బాధితుడిని పరామర్శించారు. తరువాత అక్కడికి 80 కిలోమీటర్ల దూరంలోని సోన్‌భద్రకు బయలుదేరారు. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన ప్రియాంకను పోలీసులు వారణాసి మీర్జాపూర్ సరిహద్దులలో నిలిపివేశారు. తరువాత చునార్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు.

ఈ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందునే ప్రియాంక బృందం అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. తనను నిలిపివేసిన అధికారులతో ప్రియాంక తీవ్రస్థాయిలో వాదనకు దిగారు. తాను బాధిత కుటుంబాలను కలుసుకునేందుకు వెళ్లుతున్నానని, అయినా తనను నిలిపివేతకు ఆదేశాలను చూపించాలని డిమాండ్ చేశారు. అక్కడ తన కుమారుడి వయస్సు బాబు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. వారిని పరామర్శించే హక్కు తనకు లేదా? అని ప్రశ్నించారు. అయినా ఎందుకు తనను నిలిపివేశారు? ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారని ప్రశ్నిం చారు. తాను కేవలం నలుగురు కార్యకర్తలతో కలిసి అక్కడికి వెళ్లుతున్నానని, నిర్థాక్షిణ్యంగా కాల్చివేతకు గురయిన వారి ఇంటివారిని కలిసేందుకు వెళ్లడం నేరమా? ఎందుకు అడ్డగించారో తెలియచేయాల్సిందేనని ఆమె రాదారిపైనే కూర్చున్నారు. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
సస్పెన్షన్లు … నిందితుల అరెస్టులు : సిఎం
సోన్‌భద్ర ఘటనకు సంబంధించి ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు, 29 మంది నిందితులను అరెస్టు చేసినట్లు యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్ చెప్పారు. శుక్రవారం ఆయన లక్నోలో విలేకరులతో మాట్లాడారు. సస్పెండ్ అయిన వారిలో ఒక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, ఒక సర్కిల్ ఆఫీసరు సహా నలుగురు పోలీసులు ఉన్నట్లు వివరించారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఘటనపై దర్యాప్తు జరుపుతోందని, పది రోజులలో నివేదిక అందిస్తుందని తెలిపారు. సోన్‌భద్ర జిల్లాలోని ఘోరావాల్ ప్రాంతంలో ఒక భూమిని గ్రామపెద్ద , మద్దతుతార్లతో స్వాధీనం చేసుకోవడానికి యత్నించగా, దీనిని భూమిపై ఉన్న వారు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. అక్కడ చాలా కాలంగా భూ వివాదం ఉందని తెలిసినా, స్థానిక అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని, వారి నిర్లక్షాన్ని తీవ్రంగా పరిగణించి వారిపై వేటు వేస్తున్నట్లు సిఎం విలేకరులకు తెలిపారు. నివేదిక రాగానే మరిన్ని చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు యజ్ఞదత్‌ను అరెస్టు చేసినట్లు, ఇప్పటివరకూ ఘటనలో వాడినట్లుగా అనుమానిస్తున్న సింగిల్ బారెల్, డబుల్ బారెల్ గన్‌లను, రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Priyanka Gandhi continues dharna against UP authorities

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సోన్‌భద్ర బాధితుల పరామర్శ దారిలో ప్రియాంక అరెస్టు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: