శివారు మున్సిపాలిటీల్లో యుద్ధప్రాతిపదికన నీటి సరఫరా…

  కీసర : నగర శివారు మున్సిపాలిటీలలో జలమండలి ద్వారా యుద్ధప్రాతిపదికన నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని ప్రగతి నగర్, సాయిప్రియ కాలనీ, కుందన్‌పల్లి, నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఈస్ట్ గాంధీ నగర్, ఆర్‌ఎల్ నగర్, రాంపల్లి ప్రాంతాలలో జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన కెల్ ఇఎల్‌ఎస్‌ఆర్ మంచినీటి ట్యాంకులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ మంచినీళ్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. […] The post శివారు మున్సిపాలిటీల్లో యుద్ధప్రాతిపదికన నీటి సరఫరా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కీసర : నగర శివారు మున్సిపాలిటీలలో జలమండలి ద్వారా యుద్ధప్రాతిపదికన నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని ప్రగతి నగర్, సాయిప్రియ కాలనీ, కుందన్‌పల్లి, నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఈస్ట్ గాంధీ నగర్, ఆర్‌ఎల్ నగర్, రాంపల్లి ప్రాంతాలలో జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన కెల్ ఇఎల్‌ఎస్‌ఆర్ మంచినీటి ట్యాంకులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ మంచినీళ్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

నగర శివారు గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా నీటి కష్టాలు తీరాయని, నేడు ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందుతుందన్నారు. నేడు ఇతర రాష్ట్రాలు మిషన్ భగీరథ స్ఫూర్తిగా పని చేస్తున్నాయన్నారు. శివారు మున్సిపాలిటీలలో మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం త్రాగు నీరు, సాగు నీటి కోసం చేపట్టిన పలు ప్రాజెక్టులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ప్రగతి నగర్ కాలనీలలో పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు.

స్పందించిన ఆయన పార్కు స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. కాలనీ వాసులు తరలివచ్చి పార్కు స్థలాల్లో పెత్త ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. పార్కు స్థలాల చుట్టూ ప్రహరీ నిర్మాణాలు చేపట్టి, యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దమ్మాయిగూడ, నాగారం మున్సిపల్ కమిషనర్లు రామలింగం, పల్లారావు, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేష్, కీసర ఎంపీపీ ఎం.ఇందిర లక్ష్మీనారాయణ గౌడ్, పీఎసీఎస్ చైర్మన్ కె.కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ఎం.స్వప్న వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ బి.రమాదేవి, మాజీ సర్పంచ్‌లు కౌకుట్ల చంద్రారెడ్డి, పి.అనురాధ యాదగిరి గౌడ్, నాయకులు జి.ఆంజనేయులు గౌడ్, ఎం.వెంకట్‌రెడ్డి, పి.యాదగిరి గౌడ్, బి.మల్లేష్ యాదవ్, ఎస్.హరి గౌడ్, బి.శ్రీనివాస్ గౌడ్, వి.పెంటయ్య గౌడ్, కె.శ్రీనివాస్‌రెడ్డి, బి.నర్సింగ్ రావు, డి.సాయినాథ్ గౌడ్, ఎన్. శ్రీనివాస్, సత్యంసాగర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Water supply in Municipalities on warlike basis

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శివారు మున్సిపాలిటీల్లో యుద్ధప్రాతిపదికన నీటి సరఫరా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.