‘బాబ్రీ’పై 9 నెలల్లో తీర్పు

  సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : బాబబీ మసీదు కూల్చివేత కేసులో తీర్పును తొమ్మిది నెలల్లో వెలువరించాలని సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయమూర్తిని ఆదేశించింది. బిజెపి సీనియర్ నేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి వంటి ప్రముఖులు కేసులో నిందితులుగా ఉన్నారు. దీనిపై విచారణ జరుపుతోన్న ప్రత్యేక న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన 1992 డిసెంబర్ 6వ తేదీన జరిగింది. రాజకీయంగా, భావోద్వేగపరంగా అత్యంత సున్నితమైన ఈ […] The post ‘బాబ్రీ’పై 9 నెలల్లో తీర్పు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : బాబబీ మసీదు కూల్చివేత కేసులో తీర్పును తొమ్మిది నెలల్లో వెలువరించాలని సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయమూర్తిని ఆదేశించింది. బిజెపి సీనియర్ నేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి వంటి ప్రముఖులు కేసులో నిందితులుగా ఉన్నారు. దీనిపై విచారణ జరుపుతోన్న ప్రత్యేక న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన 1992 డిసెంబర్ 6వ తేదీన జరిగింది. రాజకీయంగా, భావోద్వేగపరంగా అత్యంత సున్నితమైన ఈ కేసులో సాక్షాల నమోదు ప్రక్రియను ఆరు నెలల్లో ముగించాలని న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఇక కేసు తీర్పును వెలువరించేందుకు 9 నెలల గడువు ఇచ్చింది.

ఇక ప్రత్యేక న్యాయమూర్తి పదవీకాలం సెప్టెంబర్ 30 వ తేదీన ముగుస్తోన్న విషయాన్ని కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ న్యాయమూర్తి పదవీకాల గడువును పెంచుతూ ఆదేశాలు వెలువరించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయమూర్తి పదవీకాల పొడిగింపు దశలో ఆయన అలహాబాద్ హైకోర్టు అధికారిక నియంత్రణలో ఉండాలని సూచించింది. ఈ కేసులో తీర్పు వెలువరించడానికి తనకు మరో ఆరు నెలల గడువు కావాలని ప్రత్యేక న్యాయమూర్తి చేసుకున్న అభ్యర్థనను ధర్మాసనం ఆమోదించింది.

బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి కుట్ర అభియోగాలను అద్వానీ, జోషీ, ఉమాభారతి, వినయ్ కతియార్, సాధ్వీ రితంబరి వంటి వారిపై నమోదు చేశారు. 2017 ఎప్రిల్ 19వ తేదీన దాఖలైన కేసుకు సంబంధించి తీవ్రస్థాయి అభియోగాలు నమోదైన గిరిరాజ్ కిశోర్, విహెచ్‌పి నేత అశోక్ సింఘాల్, విష్ణు హరి దాల్మియాలు విచారణ దశలోనే మృతి చెందారు. వారిపై కేసులు ఎత్తివేశారు. ఇక ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బిజెపి నేత కళ్యాణ్ సింగ్ ఉన్నప్పుడు బాబ్రీ కూల్చివేత ఘటన జరిగింది. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్నారు. ఆయన గవర్నర్ పదవిలో ఉన్నంత కాలం రాజ్యాంగపరంగా ఆయనపై కేసు విచారణ జరిగేందుకు వీల్లేదు.

Finish Babri case in 9 months orders Supreme Court

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘బాబ్రీ’పై 9 నెలల్లో తీర్పు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: