ఆహా! ఏమి రుచి

  సాయంత్రాలు ముసురేసిన మబ్బుల్లో ఏవైనా అలా వేడిగా తినాలనిపిస్తుంటుంది. బయట బండిపై దొరికేవి తింటే ఆరోగ్యానికి చేటు. ఇంట్లో తయారుచేసుకోవడం చాలా సులభం. ఇవి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకెందుకు ఆలస్యం ఈ ఆదివారాన్ని ఆహ్లాదంగా మలుచుకోండి. బ్రెడ్ పోహా కట్‌లెట్ కావల్సినవి: ఉడికించిన బంగాళాదుంప ముద్ద – కప్పు, అటుకులు – అరకప్పు, బ్రెడ్‌స్లైసులు – రెండు, పల్లీలు – పావుకప్పు, […] The post ఆహా! ఏమి రుచి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సాయంత్రాలు ముసురేసిన మబ్బుల్లో ఏవైనా అలా వేడిగా తినాలనిపిస్తుంటుంది. బయట బండిపై దొరికేవి తింటే ఆరోగ్యానికి చేటు. ఇంట్లో తయారుచేసుకోవడం చాలా సులభం. ఇవి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకెందుకు ఆలస్యం ఈ ఆదివారాన్ని ఆహ్లాదంగా మలుచుకోండి.

బ్రెడ్ పోహా కట్‌లెట్

కావల్సినవి: ఉడికించిన బంగాళాదుంప ముద్ద – కప్పు, అటుకులు – అరకప్పు, బ్రెడ్‌స్లైసులు – రెండు, పల్లీలు – పావుకప్పు, ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు, అల్లం, పచ్చిమిర్చి తరుగు – చెంచా చొప్పున, కొత్తిమీర తరుగు- మూడు చెంచాలు, నిమ్మరసం – రెండు చెంచాలు, ఉప్పు – తగినంత, నూనె – వేయించేందుకు సరిపడా.
తయారీ: అటుకుల్ని పావుగంట సేపు నీటిలో నానబెట్టి నీళ్లు పిండి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి ముద్దలా కలపాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని కట్‌లెట్‌ల మాదిరి చేసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె వేయాలి. అది వేడయ్యాక ఈ కట్‌లెట్‌లను రెండు చొప్పున వేసి వేయించి తీసుకుంటే చాలు.

 

ఆలూ టోస్ట్

కావల్సినవి: పచ్చిమిర్చి తరుగు – చెంచా, ఉల్లిపాయ ముక్కలు కప్పు, క్యాప్సికమ్ ముక్కలు అర కప్పు, టొమాటో ముక్క లు – రెండు చెంచాలు, చింతపండు గుజ్జు – చెంచా, పసుపు – పావు చెంచా, కారం – అరచెంచా, ఉప్పు – తగినంత, గరంమసాలా – అరచెంచా, జీలకర్ర పొడి – అరచెంచా, చాట్ మసాలా- చిటికెడు, ఉడికించిన ఆలూ – రెండు, కొత్తిమీర – కట్ట, బ్రెడ్ స్లైస్‌లు – రెండు, నూనె -మూడు చెంచాలు, వెల్లుల్లి తరుగు – చెంచా, టొమాటో కెచప్ – కొద్ది గా, వెన్న కొద్దిగా, గ్రీన్ చట్నీ – చెంచా.
తయారీ: మొదట స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి నూనె పోయాలి. అది వేడి కాగానే వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు వర్ణం వచ్చేవర కు వేయించాలి. క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి సన్న మంటపై వేయించాలి. ఇప్పుడు ఉప్పు, కారం, గరంమసాలా, జీలకర్ర పొడి వేసి మరికొద్దిసేపు వేయించాలి. ఇందులోనే ఉడికించి మెదిపి పెట్టుకున్న బంగాళాదుంపలను వేసి బాగా కలపాలి. కాసింత కొత్తిమీర కూడా జత చేయాలి. దీన్ని పొయ్యి మీద నుంచి దింపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైస్‌లు తీసుకుని ఒక వైపు వెన్న రాసుకోవాలి. మరోవైపు గ్రీన్ చట్నీని రాయాలి. ఒకదానిపై పెద్ద చెంచాతో ఆలూ మిశ్రమాన్ని వేసి నాలుగు వైపులా సమంగా పరిచి, మరోదాన్ని ఉంచేయాలి. ఈ బ్రెడ్‌ను పెనంపై వేసి బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. దీన్ని ప్లేట్‌లోకి తీసుకుని త్రికోణాకృతిలో కోసుకోవాలి. ఇప్పుడు వీటిపై టొమాటో కెచప్, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే చెంచా చింతపండు గు జ్జు, చిటికెడు చాట్ మసాలా కూడా చల్లుకోవాలి. చివరగా సేవ్‌తో అలంకరించుకుంటే రుచికరమైన ఆలూ టోస్ట్ రెడీ! సాయంత్రాలు చేసిపెట్టొచ్చు.

 

వెజిటబుల్ రోటీ
కావల్సినవి: గోధుమపిండి – ఒక కప్పు, నూనె – పావుకప్పు, క్రీం చీజ్ – ఒక చిన్న డబ్బా, మిరియాలపొడి, కారం – అరచెంచా చొప్పున ఉప్పు – తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద – చెంచా, క్యారెట్ తురుము – పావుకప్పు, కొత్తిమీర తరుగు – రెండు పెద్ద చెంచాలు, జీలకర్ర – చెంచా, నువ్వులు – అరచెంచా.
తయారీ: నూనె, క్రీంచీజ్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ చపాతీపిండిలా చేసుకోవాలి. ఇది పదినిమిషాలు నానాక మరోసారి కలిపి ఓ ఉండను తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. దీన్ని వేడిపెనంమీద వేసి రెండువైపులా నూనె వేసుకుని కాల్చుకుని తీసుకోవాలి. ఇప్పుడు క్రీంచీజ్ రాయాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా చేసుకుంటే చాలు. కావాలనుకుంటే ఈ చపాతీని నచ్చిన ఆకృతిలో చేసుకోవచ్చు.

 

పాలక్ టోస్ట్

కావల్సినవి : బ్రెడ్‌స్లైసులు – ఆరు, వెన్న – పా వుకప్పు, ఉడికించిన బంగాళాదుంప ముద్ద – ముప్పావుకప్పు, పచ్చిమిర్చి – రెండు (సన్న గా తరగాలి), పాలకూర తరుగు – అరకప్పు, ఆమ్‌చూర్‌పొడి, కారం, చాట్‌మసాలా – అరచెంచా చొప్పున, గరంమసాలా – పావుచెంచా, ఉప్పు – తగినంత, నువ్వులు – పెద్ద చెంచా.
తయారీ : ఓ గిన్నెలో బంగాళాదుంప ము ద్ద తీసుకోవాలి. అందులో పచ్చిమిర్చి తరు గు, పాలకూర తరుగు, ఆమ్‌చూర్‌పొడి, చాట్‌మసాలా, కారం, గరంమసాలా, ఉ ప్పు వేసి కలపాలి. బ్రెడ్‌స్లైసులపై ఈ మిశ్రమాన్ని పరిచి, కొన్ని నువ్వుల్ని చల్లి, నొక్కినట్లు చేయాలి. ఇప్పుడు పొయ్యిమీద పె నం పెట్టి… కొద్దిగా వెన్న రాయాలి. దీనిపై రెండు బ్రెడ్‌స్లైసుల్ని ఉంచి, ఎర్రగా కాల్చా లి. ఇలా మిగిలినవీ చేసుకుంటే చాలు.

indian Variety Breakfast Food Recipes

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆహా! ఏమి రుచి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: