ఆ కండీషన్‌కు ఒప్పుకుంటేనే సైన్…

  ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో పూజా హెగ్డే మొదటి స్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్స్ తో నటిస్తున్న ఈ అమ్మడు హిందీలో కూడా ఒక సినిమాకు కమిట్ అయినట్లుగా తెలిసింది. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న ఈ అమ్మడు సినిమాకు కమిట్ అయ్యేటప్పుడు ఒక వింత కండీషన్ పెడుతుందట. ఆ కండీషన్ కు ఒప్పుకుంటే, తనకు నమ్మకం కలిగితేనే సినిమాకు సైన్ చేస్తుందట. […] The post ఆ కండీషన్‌కు ఒప్పుకుంటేనే సైన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో పూజా హెగ్డే మొదటి స్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్స్ తో నటిస్తున్న ఈ అమ్మడు హిందీలో కూడా ఒక సినిమాకు కమిట్ అయినట్లుగా తెలిసింది. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న ఈ అమ్మడు సినిమాకు కమిట్ అయ్యేటప్పుడు ఒక వింత కండీషన్ పెడుతుందట. ఆ కండీషన్ కు ఒప్పుకుంటే, తనకు నమ్మకం కలిగితేనే సినిమాకు సైన్ చేస్తుందట.

సాధారణంగా సినిమాలకు సైన్ చేసేప్పుడు హీరో అయినా హీరోయిన్ అయినా తమ పాత్రకు కథలో మంచి ప్రాముఖ్యత ఉండటంతో పాటు సినిమాలో తాము కీలకంగా ఉండాలని కోరుకుంటారు. ఇక పారితోషికం ఎక్కువగా ఇవ్వాలని కూడా ఆశ పడతారు. కానీ పూజా హెగ్డే మాత్రం తాను సినిమాకు ఒప్పుకోవాలంటే షూటింగ్ సెట్స్‌లో అందరూ సరదాగా ఉండాలని… సరదాగా షూటింగ్ చేయాలని కండీషన్స్ పెడుతోంది.

సినిమా ఒప్పుకునే ముందే ఆమె దర్శక నిర్మాతలతో ఈ కమిట్ మెంట్ తీసుకుని మరీ సైన్ చేస్తుందట. “ఒక్కో సినిమాకు నెలల తరబడి వర్క్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సినిమాలకు ఏకంగా సంవత్సరాలు కూడా టీంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అలాంటిది సెట్స్‌లో ఎంజాయ్ అనేది లేకపోతే ఎలా?”అని అంటోంది పూజాహెగ్డే. ఎక్కువ సమయం షూటింగ్‌లో గడిపే మాలాంటి వారికి ఎంజాయ్‌మెంట్ వర్క్‌లోనే ఉండాలని అంటోంది ఈ బ్యూటీ.

Pooja hegde said Shooting sets should be fun for everyone

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆ కండీషన్‌కు ఒప్పుకుంటేనే సైన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.