కుటుంబ కలహాలతో భార్యను నరికిన భర్త…

  దౌల్తాబాద్ : కుటుంబ కలహాలతో బార్యను, భర్త పట్టపగలు నడిరోడ్డుపై కత్తితో నరికిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం రోజు కలకలం రేపింది. గ్రామస్తులు, ప్రత్యక్షసాక్షులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన పల్లెవోని రామప్ప, మణెమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు. తమ చిన్నకూతురైన గోవిందమ్మకు మండల పరిదిలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన నారాయణను ఇల్లరికం తీసుకువచ్చి 16 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వారికి ఇద్దరు మగ పిల్లలు. గత సంవత్సర […] The post కుటుంబ కలహాలతో భార్యను నరికిన భర్త… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దౌల్తాబాద్ : కుటుంబ కలహాలతో బార్యను, భర్త పట్టపగలు నడిరోడ్డుపై కత్తితో నరికిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం రోజు కలకలం రేపింది. గ్రామస్తులు, ప్రత్యక్షసాక్షులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన పల్లెవోని రామప్ప, మణెమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు. తమ చిన్నకూతురైన గోవిందమ్మకు మండల పరిదిలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన నారాయణను ఇల్లరికం తీసుకువచ్చి 16 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వారికి ఇద్దరు మగ పిల్లలు. గత సంవత్సర కాలం వరకు సాఫీగా కొనసాగిన వారి సంసారం గత కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్దలతో కలహాల కాపురంగా మారింది.

గోవిందమ్మ గత కొంత కాలంగా మండల కేంద్రంలోని కోఆపరేటివ్ కాంప్లెక్స్‌లో బేకరీ నిర్వహిస్తూ కాలం వెళ్ళ దీస్తుంది. అదే కాంప్లెక్స్‌లో ఆమె భర్త సైతం హోల్‌సేల్ కిరాణం దుకాణం నిర్వహించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బార్యపై విపరీతంగా ద్వేషం పెంచుకున్న నారాయణ శుక్రవారం మద్యాహ్నం అందరూ చూస్తుండగానే బార్యను కత్తితో అతి దారుణంగా నరికివేశాడు. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు ఎవరూ కూడ ఆయనను ఆపడానికి సాహసించలేదు.

బార్యను కిరాతకంగా నరికిన నారాయణ అనంతరం కత్తి చేత పట్టుకొని నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొన ఊపిరితో ఉన్న గోవిందమ్మను చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో కోడంగల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా విషమించడంతో గోవిందమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌లోని గాంధీ ఆసుసత్రికి తరలించినట్లు సీఐ నాగేశ్వరరావ్, ఎస్సై సతీష్‌లు తెలిపారు.

Husband who killed his wife with Family Quarrels

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కుటుంబ కలహాలతో భార్యను నరికిన భర్త… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.