భార్య, అత్తను కత్తితో దాడి చేసిన అల్లుడు

  గోపాలపురం: భార్య, అత్తను ఓ వ్యక్తి కత్తితో దారుణంగా నరికి చంపిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం మండలంలోని దొండపూడిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని దొండపూడికి చెందిన కాంతారావు అనే వ్యక్తి కుటుంబ కలహాలతో భార్య పుష్పలత, అత్త లక్ష్మితో పాటు బావ మరిది మంగారావుపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో పుష్పలత, లక్ష్మి మృతిచెందగా, బావ మరిది మంగారావు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. దగ్గరలోని […] The post భార్య, అత్తను కత్తితో దాడి చేసిన అల్లుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గోపాలపురం: భార్య, అత్తను ఓ వ్యక్తి కత్తితో దారుణంగా నరికి చంపిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం మండలంలోని దొండపూడిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని దొండపూడికి చెందిన కాంతారావు అనే వ్యక్తి కుటుంబ కలహాలతో భార్య పుష్పలత, అత్త లక్ష్మితో పాటు బావ మరిది మంగారావుపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో పుష్పలత, లక్ష్మి మృతిచెందగా, బావ మరిది మంగారావు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. దగ్గరలోని స్థానికులు క్షతగాత్రుడు మంగారావును సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానికులు కాంతారావును నిర్భందించినట్లు పోలీసులకు సమాచారం అందించాడంతో ఘటన స్థలికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలియజేశారు.

Man Attack with knife on Wife and Mother in law

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భార్య, అత్తను కత్తితో దాడి చేసిన అల్లుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: